మాటల మాంత్రికుడు మౌనం వీడారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా వుంటున్న ఆయన తాజాగా శనివారం జరిగిన `భీమ్లానాయక్` సక్సెస్ మీట్ లో పెదివి విప్పారు. అయితే ఈ సందర్భంగా 1980`s నటులపై త్రివిక్రమ్ చేసిన షాకింగ్ స్టేట్‌మెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `భీమ్లానాయక్`. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ కల్యాణ్ తో పాటు ఇందులో రానా కూడా కీలక పాత్రలో నటించారు.
ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర బృదం సక్సెస్ మీట్ ని నిర్వహించింది. గత కొన్ని రోజులుగా మౌనంగా వున్న త్రివిక్రమ్ ఈ వేడుకలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముందు మీడియాకు థాంక్స్ అంటూ మొదలుపెట్టిన ఆయన నేను సినిమా తీస్తే మీడియా దాన్ని భుజాలమీద వేసుకుని జనాల వద్దకు తీసుకెళ్లింది. అందుకు వారందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం అన్నారు.
`అయ్యప్పనుమ్ కోషియుమ్`ని మొదటి తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు మాకు కనిపించిన పెద్ద సమస్య ఏంటంటే కథ మొత్తం అందులో కోషియుం (డేనియల్ శేఖర్) కోణంలో సాగుతుంది. కానీ దాన్ని అయ్యప్పనుమ్ (భీమ్లానాయక్) వైపు నుంచి ఎలా చెప్పాలి? .. ఇద్దరి పాత్రలని బ్యాలెన్డ్ గా ఎలా చూపించాలి? అనే దానిపై ఎన్నో సార్లు చర్చించాం.
అప్పుడు మాకు తట్టిన ఆలోచన.. అడవికి సెల్యూట్ చేయడం నుంచి ప్రారంభించి `భీమ్లానాయక్` క్యారెక్టర్ కు దగ్గరగా కథను తీసుకెళ్తే న్యాయంచేయగలమనిపించింది. పవన్ ఇమేజ్‌ని.. అభిమానులు ఏం కోరుకుంటారో దృష్టిలో పెట్టుకుని ప్రతీ సీన్ సహజంగా వుండేలా ప్లాన్ చేశాం.
ఈ సినిమా కోసం నటీనటులు ఎంతో కష్టపడ్డారు. గడచిన ఐదారు సంవత్సరాల నుంచి చూస్తుంటే 1980 కాలం నాటి నటులతో పోలిస్తే ఇండియన్ న్యూ జనరేషన్ నటులు ఎంతో టాలెంట్ వున్న వ్యక్తులు అని అర్థమవుతోంది` అంటూ షాకింగ్ కామెంట్ లు చేశారు. ఆ తరువాత ఈ స్టేట్‌మెంట్ తో బాధపడితే క్షమించండి. కానీ ఇప్పటి వరం వాళ్లకు సినిమాపై ప్రేమ, ప్రతి విషయంలో వాళ్లకున్న అవగాహన గొప్పది. అని చెప్పుకొచ్చారు త్రివిక్రమ్.
అంతే కాకుండా గణేష్ మాస్టర్ 600 మందిపై చిత్రీకరించిన పాట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గణేష్ మాస్టర్ స్టెప్పులు బాగా కంపోజ్ చేశారు. సుమారు 600 మందితో సాంగ్ షూట్ చేయడం మామూలు విషయం కాదు. ఆ సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో సెట్ లోకి వెళ్లగానే అక్కడ అంత మంది జనాన్ని చూసి నేను పారిపోయా అన్నారు త్రివిక్రమ్.