ఈ యాంగిల్ లో చూస్తే.. త్రివిక్రమ్ బన్నీకి సో స్పెషల్

Update: 2020-01-07 04:30 GMT
వయసు 36 సంవత్సరాలు. సినిమాల్లో కెరీర్ 35 ఏళ్లు. అయినా.. ఇప్పటివరకూ చేసింది పాతిక సినిమాలే (అతిధి పాత్రలతో కలిపి) తెలుగులో ఏ హీరోకు సాధ్యం కాని అంకెలు అల్లు అర్జున్ కు మాత్రమే సొంతంగా చెప్పాలి. ఇదేం లెక్క? కాస్త కన్ఫ్యూజ్ అయ్యారేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకటికి రెండుసార్లు లెక్కలు వేసుకొనే చెబుతున్నాం.

పుట్టింది 1983 ఏప్రిల్ ఎనిమిది అయినా.. బాల నటుడిగా తన ఊహ కూడా సరిగా లేనంత చిన్నారిగా.. బాల నటుడిగా 1985లో విడుదలైన విజేత చిత్రంలో నటించాడు బన్నీ. తర్వాత స్వాతిముత్యం చిత్రంలో బాల నటుడిగా నటించిన అల్లు అర్జున్ తర్వాత మాత్రం సినిమాలేమీ చేయలేదు.

దాదాపు పదహారేళ్ల గ్యాప్ తర్వాత డాడీ చిత్రంలో మళ్లీ కనిపించిన బన్నీ.. అందరిని ఆకర్షించారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లుఅర్జున్.. మొదట్లో ఏడాదికి ఒక సినిమా చొప్పున చేసిన అల్లు అర్జున్ 2010లో మాత్రం తొలిసారి ఏడాదిలో రెండు సినిమాలు చేశాడు. మళ్లీ రెండేళ్ల తర్వాత అంటే 2014లో ఒక షార్ట్ ఫిలింతో పాటు.. మరో రెండు సినిమా చేశాడు.

తను పుట్టిన రెండేళ్లకే నటుడిగా అనిపించుకున్నా.. 36 ఏళ్లు వచ్చేసరికి చేసిన సినిమాలు పాతికగా లెక్క తేలినా.. అతిధిపాత్రల్ని మినహాయిస్తే.. ఇరవై కూడా ఉండవు. తాజాగా ఇరవై నెలల గ్యాప్ తర్వాత అల వైకుంఠపురముతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. ఇలా ఆచితూచి అన్నట్లు సినిమాలు చేసే బన్నీ.. ఒకే దర్శకుడితో మూడు సినిమాలు చేసింది మాత్రం త్రివిక్రమ్ తోనే.

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’.. తాజా అల వైకుంఠపురము చిత్రాలు చేసిన బన్నీ.. తనకు త్రివిక్రమ్ ఎంత స్పెషలో తన మాటలతో చెప్పేశాడు. మూడుసార్లు తాను ఏ దర్శకుడితో పని చేయలేదని.. తానీ స్థాయిలో ఉన్నానంటే కారణం త్రివిక్రమ్ అంటూ.. ఆయన తనకెంత స్పెషల్ అన్నది తన మాటలతో చెప్పేశాడు అల్లు అర్జున్.
Tags:    

Similar News