కుర్ర బ్యూటీ కోసం మహేశ్ కథలో కీలక మార్పులు చేసిన త్రివిక్రమ్..?

Update: 2022-04-25 10:31 GMT
సూపర్ స్టార్ మ‌హేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది 'అతడు' 'ఖలేజా' తర్వాత వీరి కలయికలో రాబోతోన్న హ్యాట్రిక్ సినిమా. ఇందులో పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాలో సెకండ్ ఫీమేల్ లీడ్ ఉంటుందని.. ఈ రోల్ కు కుర్ర బ్యూటీ శ్రీలీల ను తీసుకున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల.. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో అర డజనుకు పైగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం అందుకుందని తెలుస్తోంది. ముందుగా ఈ పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యత లేదట. ఏదో గ్లామర్ కోసం రెండో హీరోయిన్ రోల్ ని క్రియేట్ చేసారట.

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ SSMB28 లో శ్రీ లీల క్యారక్టర్ ను పూర్తిగా చేంజ్ చేసారట. ఓ సాంగ్ ఇవ్వడంతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలను జోడిస్తున్నారట. దీంతో కన్నడ బ్యూటీ ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి ఒక ఫ్యామిలీ సాంగ్ మరియు ఒక లవ్ డ్యూయెట్ లో ఆడిపాడనుందని అంటున్నారు.

త్రివిక్రమ్ గత చిత్రాల్లో మెయిన్ హీరోయిన్ తో పాటుగా మరో ఫీమేల్ లీడ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. 'జల్సా' లో పార్వతీ మెల్టన్.. 'అత్తారింటికి దారేది' చిత్రంలో ప్రణీత.. 'అ ఆ' లో అనుపమ పరమేశ్వరన్.. 'అర‌వింద స‌మేత‌' లో ఈషా రెబ్బా.. 'అల వైకుంఠపురములో' మూవీలో నివేదా పేతురాజ్ వంటి ముద్దుగుమ్మలు అలాంటి పాత్రల్లో సందడి చేశారు. అయితే ఈ సినిమాలలో వారి పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు.

అంతేకాదు ఆ సినిమాలు వాళ్ళ కెరీర్ కు పెద్దగా హెల్ప్ అవ్వలేదనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు మహేశ్ సినిమాలో శ్రీ లీల పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని.. ఈ బ్యూటీకి ఖచ్చితంగా మంచి పేరు ఫేమ్ తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఇది నిజమే అయితే శ్రీలీలకు మహేశ్ సినిమా ఎలాంటి క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

SSMB28 చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబడిన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మది సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.
Tags:    

Similar News