పాత సినిమాల థీమ్ ని స్ఫూర్తిగా తీసుకుని కొత్త సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడని నిరూపించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇండస్ట్రీ హిట్టు కొట్టిన అల వైకుంఠపురములో చిత్రానికి టాలీవుడ్ క్లాసిక్ మూవీ స్ఫూర్తి అన్నది తెలిసినదే. ఆయన తీసిన చాలా సినిమాలకు ఏదో ఒక స్ఫూర్తి ఉందని విశ్లేషకులు చెబుతుంటారు. అది మంచిదే. అదంతా అటుంచితే రీమేక్ లు చేసేప్పుడు ఆయన ఏం మాయం చేస్తాడో ఏ మంత్రం వేస్తాడో? అంటూ ఒకటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అభిమానులు.
అసలే మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియంని తన స్నేహితుడు పవన్ తో రీమేక్ చేస్తున్నారు. సాగర్ చంద్ర దర్వకుడు అయినా కానీ త్రివిక్రముడే అన్నీ తానే అయ్యి చేస్తున్నారు. రచన సంభాషణలు ఆయనవే. దీంతో ఒకటే ఉత్కంఠ నెలకొంది. అన్నట్టు ఒరిజినల్ లో ఉన్న గ్రిప్ చెడకుండా యథాతథంగా చిత్రీకరిస్తున్నారా ? లేక పవన్ ఇమేజ్ కి తగ్గట్టు ప్రతిదీ మార్చేస్తున్నారా? అన్న సందిగ్ధత నెలకొంది.
అయ్యప్పనుమ్ కోషియం సీరియస్ ఎమోషన్స్ తో పాటు గ్రిప్ ఉన్న కథనంతో రక్తి కట్టిస్తుంది. ఒరిజినల్ లో ఉన్న ఫీల్ ని తేగలిగితే తెలుగులోనూ హిట్టే. కానీ ఇక్కడ కామెడీలు ఎంటర్ టైన్ మెంట్ అంటూ అదనపు హంగులు జోడిస్తే కాస్త కష్టమేనన్న మాట వినిపిస్తోంది.
ఇందులో పవన్ తో పాటు రానా కీలక పాత్రను పోషిస్తున్నారు. పవన్-రానా మల్టీస్టారర్ గా రికార్డుల్లోకెక్కనున్న చిత్రమిది. 2022 సంక్రాంతి బరిలో మూవీ రిలీజ్ కానుంది. అయితే ఇంకా చాలా సమయం ఉండగానే మేకర్స్ మొదటి సింగిల్ ను త్వరలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సింగిల్ తోనే సినిమా ప్రమోషన్ ని ప్రారంభిస్తున్నారు. నిజానికి అయ్యప్పనుమ్ కోశియుమ్ లో పాటలు పూర్తిగా అసంబద్ధం కాబట్టి.. ఒక పాటతో తెలుగు వెర్షన్ ప్రమోషన్ ప్రారంభించడం సరైనదేనా? అంటూ చర్చ సాగుతోంది. ఒకవేళ ఈ సీరియస్ డ్రామాలో పాటల డామినేషన్ ఇబ్బందికరంగా ఉంటుందేమో అన్న థాట్ స్ఫురిస్తోంది. అయితే త్రివిక్రమ్ ఏదో ఒక మ్యాజిక్ చేయకుండా ఉండరు. అసంబద్ధంగా ఏదీ చూపించరు! అన్న భరోసా నమ్మకం ఆయన అభిమానుల్లో ఉంది. ఒరిజినల్ కంటే మెరుగైన రీమేక్ ని త్రివిక్రమ్ - సాగర్ చంద్ర బృందం తెరకెక్కిస్తారనే అంతా భావిస్తున్నారు. కానీ అయ్యప్పనుమ్ కోషియం కూడా అసురన్ రీమేక్ నారప్పలానే చేస్తే బావుంటుందనేది చాలా మంది నిపుణుల నివేదన.
ఎన్టీఆర్.. ప్రభాస్ లతో ఎప్పుడు?
ప్రస్తుతం మహేష్ తో సినిమా కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న త్రివిక్రమ్ తదుపరి ఎన్టీఆర్ .. ప్రభాస్ లతోనూ సినిమాలు చేసేందుకు ప్లాన్ లో ఉన్నారని తెలిసింది. ప్రభాస్ తో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బృందం ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అయితే ఈ మూవీకి ప్రభాస్ సంతకం చేయాలంటే తదుపరి లైన్ లో ఉన్న నాలుగు చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యేందుకు రెండేళ్లు పైగానే పడుతుందని అంచనా. ఆ తర్వాతే హారిక సంస్థతో సినిమా చేసే వీలుంటుంది. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని మాయావి ఓ డిఫరెంట్ నేరేషన్ తో ఇన్సెప్షన్ లాంటి సినిమా తీయాల్సి ఉంటుంది. అన్నీ కుదిరితే ఈపాటికే తారక్ తోనూ మొదలు పెట్టాల్సినది. కానీ మిస్సయ్యింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆ మూవీ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసినదే. కొరటాలతో సినిమా తర్వాత త్రివిక్రమ్ తో తారక్ సినిమా చేయాల్సి ఉంది. వీటి కోసం స్క్రిప్టుల్ని మాయావి రెడీ చేస్తున్నారట.