గురూజీ వెనక్కిచ్చాడట!

Update: 2018-09-29 10:18 GMT
స్టార్ ప్రొడ్యూసర్ DVV. దానయ్య నాలుగేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అడ్వాన్సు ఇచ్చాడట.  కానీ అప్పటినుండి త్రివిక్రమ్ తన సినిమాలన్నీ హారిక హాసినీ సంస్థలోనే చేస్తూ వచ్చాడు. పైగా రానున్న రెండేళ్లలో అల్లు అర్జున్.. వెంకటేష్..కమిట్ మెంట్స్ ఉన్నాయట.  అవేవీ దానయ్య బ్యానర్ లో చేసే సినిమాలు కావు.  దీంతో ఇక త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదని డిసైడ్ అయిన దానయ్య తన అడ్వాన్సు ను తిరిగివ్వమని గురూజీని డిమాండ్ చేసినట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి.

తాజా సమాచారం మేరకు త్రివిక్రమ్ దానయ్య నుండి అందుకున్న అడ్వాన్సును ఆయనకు తిరిగి ఇచ్చాడట. త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్టులకు ఆల్రెడీ ప్రొడ్యూసర్లు ఫిక్స్ అయ్యారు. ఇక వారి తర్వాత దానయ్యకు సినిమాచేయల్సి ఉంటుంది.. దానయ్య కూడా త్వరలో రాజమౌళి సినిమాతో బిజీ కానున్నాడు. ఆ సినిమా కు ఏడాదిన్నరకు పైగా సమయం పడుతుంది కాబట్టి  ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోయే రెండేళ్లలో కుదిరేలా లేకపోవడంతో ఈ డెసిషన్ తీసుకున్నాడట.  

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన తాజా చిత్రం 'అరవింద సమేత' అక్టోబర్ 11 న రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఈ సినిమా ఫలితాన్ని బట్టే త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఏ హీరోతో ఉంటుందో తేలే అవకాశం ఉంది.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అరవింద సమేత' రిజల్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడని.. ఒకవేళ హిట్ అయిన పక్షంలో వెంటనే త్రివిక్రమ్ కు ఓకె చెప్తాడని టాక్ వినిపిస్తోంది.  


Tags:    

Similar News