సర్దార్ ఆడియో: త్రివిక్రమ్ కి సరిపోలేదట

Update: 2016-03-20 16:19 GMT
ఏ వేడుకలో అయినా.. మాటల మాత్రింకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడంటే.. విని గుర్తుంచుకోవాల్సిన డైలాగ్స్ రెండు మూడైనా పడుతుంటాయి. కానీ పవర్ స్టార్ పవన్ మూవీకి సంబంధించిన వేడుకలో అయితే.. త్రివిక్రమ్ కూడా రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడడాన్ని గమనించచ్చు.

'ఏ పూజైనా వినాయకుడికి నమస్కరించి ప్రారంభిస్తాం. ఈ వేడుకను మెగాస్టార్ చిరంజీవికి నమస్కరించి ప్రారంభిస్తున్నా'అంటూ దండం  పెట్టడంతో... చిరు కూడా రెండు చేతులు ఎత్తి నమస్కరించిన దృశ్యం ఆకట్టుకుంది. అంటే మనకు మెగాస్టార్ విఘ్నేశ్వరుడితో సమానం అని చెప్పాడు త్రివిక్రమం. తెలుగు సినిమా బలాన్ని  ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అని.. ఎన్నో సంవత్సరాలు అలరించారని.. మళ్లీ తన రీఎంట్రీ తర్వాత ఇంకా ఎన్నో ఏళ్లు అలరించాలని కోరుకుంటున్నానని చెప్పాడు త్రివిక్రమ్.

'మెగాస్టార్ తన కుటుంబం నుంచి పవర్ స్టార్ ని ఇచ్చారు. మనకు ఇంకా సరిపోలేదని మెగా పవర్ స్టార్ ను కూడా ఇచ్చారు. ఇంకా చాలామందిని ఇస్తున్నారు. వీరంతా కూడా మీలాగా మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నా అంటూ మెగాస్టార్ చిరంజీవిని ఆకాశంలోకి ఎత్తేశాడు పొగిడేశాడు మాటల మాంత్రికుడు.

అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ' వేళ్లు కాళ్లై నడిచే మనిషే చెట్టు అన్నట్లుగా.. ఆవేశం, ఆదర్శం కదిలి నడిచే మనిషి పవన్ కళ్యాణ్' అన్నాడు త్రివిక్రమ్. 'పిడికెడు మట్టే కావచ్చు.. దేశపు జెండాకున్నంత పొగురు తనకుంది,  అలాంటి పొగరుకు, సర్దార్ గబ్బర్ సింగ్ కు శుభాకాంక్షలు' అన్నాడు మాటల మాంత్రికుడు.

తాను సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీతో మాట్లాడదామని అనుకున్నానని... కానీ అతను కెమేరా వెనక పరిగెడుతూనే ఉన్నారని, సక్సెస్ మీట్స్ అయిపోయాక, రికార్డులన్నీ లెక్కపెట్టుకున్నాక అప్పుడు బాబీతో ప్రత్యేకంగా మాట్లాడతానన్న త్రివిక్రమ్... 'భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఒకటి కావాలి. అది ఈ సినిమాతో జరగాలి' అంటూ సర్దార్ హిందీ వెర్షన్ కి కూడా శుభాకాంక్షలు చెప్పాడు త్రివిక్రమ్. 
Tags:    

Similar News