త్రివిక్రమ్ ఏది చేసినా గ్రాండ్ గా ఉంటుంది అన్న మాట నిజమే. మొదటి సినిమా నువ్వే నువ్వేను మినహాయిస్తే అతడు మొదలుకుని అజ్ఞాతవాసి దాకా బడ్జెట్ విషయంలో మాటల మాంత్రికుడు ఏనాడూ రాజీ పడింది లేదు. స్వంత బ్యానర్ అయినా బయటవాళ్ళతో అయినా లెక్కల్లో పెద్దగా మార్పు ఉండదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో రూపొందిస్తున్న అరవింద సమేత వీర రాఘవ కోసం కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఓ సీన్ లో బాగా ఆకులు పండిన ఓ చెట్టు కావల్సి వస్తే త్రివిక్రమ్ కోరుకున్న రీతిలో నిజమైన చెట్టు ఎక్కడా కనిపించలేదట. వెతుకుతూ పోతే టైం వేస్ట్ అవ్వడం తప్ప ఇంకే ఉపయోగం లేదని గుర్తించిన త్రివిక్రమ్ వెంటనే చెన్నయ్ నుంచి ప్లాస్టిక్ ఆకులను తెప్పించి కృత్రిమంగా చెట్టుని ఆర్ట్ డైరెక్టర్ తో వేయించాడట. చెన్నై నుంచి తెప్పించిన ఆ ఆకుల ఖరీదు ఎంతో తెలుసా. అక్షరాలా పాతిక లక్షలట. వామ్మో అని ఆశ్చర్యపోకండి.
త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్ అంతే మరి. ఆకులు నిండిన చెట్లతో పాటు వాడిపోయిన చెట్లను కూడా లొకేషన్ లో సెట్ చేశారట. కాకపోతే గాలి వానకు ఓసారి అన్ని పడిపోతే తిరిగి అతికించే క్రమంలో టీమ్ పెద్ద పాట్లే పడిందని సమాచారం. పాట కోసమా లేక ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చే ఏదైనా భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసమా అనే వివరాలు మాత్రం బయటికి చెప్పడం లేదు. అక్టోబర్ 11 విడుదల టార్గెట్ చేసుకున్న అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ ఊపందుకుంది. డేట్ తరుముకొస్తోంది. మరోవైపు పూర్తి స్థాయిలో ప్రమోషన్ మొదలుపెట్టనే లేదు. టీజర్ మాత్రమే వచ్చింది. హరికృష్ణ గారి దుర్మరణం వల్ల కొంత గ్యాప్ వచ్చినా దాన్ని డే అండ్ నైట్ షిఫ్ట్స్ లో కవర్ చేస్తున్నారు. జై లవకుశ తర్వాత ఏడాది గ్యాప్ తో వస్తున్న జూనియర్ సినిమా కాబట్టి అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. తారక్ ను డీల్ చేయటం మొదటిసారి కాబట్టి త్రివిక్రమ్ కూడా ఇంతకు ముందు చూడని రీతిలో పాత్రను డిజైన్ చేసినట్టు తెలిసింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.