అసలు 'అజ్ఞాతవాసి' సినిమా రిలీజ్ హంగామా ఏమో కాని.. ఈ సినిమా కాపీ అంటూ వస్తున్న వార్తలన్నీ అభిమానులను షేక్ చేస్తున్నాయి. దానికితోడు టి-సిరీస్ వారు కోర్టులో కేసేస్తాం.. లేదంటే డబ్బుల సెటిల్మంట్ అంటూ ఇక్కడే తిష్టవేసుకుని కూర్చోవడంతో.. చివరకు ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు. అసలే పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి.. వారు కూడా కాస్త గట్టిగా ముట్టజెపితేనే కేసులు గట్రా పెట్టకుండా ఉంటాం అన్నారు కాని.. చివరకు అసలు సినిమా కాపీయే కాదని తెలియడంతో అందరూ సంతోషిస్తున్నారు.
ఈ సందర్భంలో ముందుగా ట్రైలర్ రిలీజ్ చేస్తాం అంటూ ఒక ప్రకటన ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తున్న విషయం ఏంటంటే.. దర్శకుడు త్రివిక్రమ్ మరియు అజ్ఞాతవాసి నిర్మాత రాధాకృష్ణలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలవడమే. ఇంతకీ ఆయన్ను ఎందుకు కలిసినట్లు? అబ్బే ఏం లేదండీ.. కేవలం ఆయన్ను మా సినిమా ప్రీమియర్ చూడ్డానికి పిలిచాం అంటూ త్రివిక్రమ్ తన సన్నిహితులతో చెప్పాడంట. కాని ఇదేదో నమ్మే రకంగా లేదు కదూ.
నిజానికి ఆంధ్రప్రదేశ్ లో అజ్ఞాతవాసి ప్రీమియర్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాని.. తెలంగాణలో మాత్రం ఇవ్వలేదట. గతంలో కాటమరాయుడు సినిమాకు కూడా పర్మిషన్ రాలేదు. అందుకే ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్ వేయడానికి తలసాని ని కలసి అర్జీ పెట్టుకున్నారన్నది టాక్. పైగా మొన్ననే పవన్ కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిశాడు కాబట్టి.. ఇక ప్రీమియర్లకు హైదరాబాద్ వంటి నగరాల్లో ఏ అడ్డంకీ ఉండకపోవచ్చు.