సినిమాలతో జనాలకు నీతులు చెబితే... వాతలు పడతాయ్. శ్రీమంతుడు వరకూ తెలుగు ఇండస్ట్రీ నమ్మకం ఇదే. కానీ సరిగా, సూటిగా చెప్పదలచుకున్న పాయింట్ కి కట్టుబడి, కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడిస్తే.. ఫలితం ఎలా ఉంటుందో మహేష్, కొరటాల ప్రూవ్ చేశారు. నిజానికి మహేష్ బాబుతో ఇలాంటి ప్రయత్నం గతంలోనే చేశాడు త్రివిక్రమ్. ఖలేజా అంటూ గిలిగింతలు పెట్టే కామెడీ చేస్తూనే... మరోవైపు గ్రామాన్ని కాపాడే పాయింట్ తో తీశారు.
ఖలేజాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ది కానీ, మహేష్ బాబుది కానీ ప్రయత్న లోపం కనిపించదు. కానీ మూవీలో మిస్ అయిందల్లా ఏంటంటే... మూవీకి కావాల్సిన పాయింట్స్ అన్నీ సమపాళ్లలో సెట్ కాకపోవడం. శ్రీమంతుడు సక్సెస్ మన మాటల మాంత్రికుడిలో మాంచి జోష్ నింపిందట. అందుకే ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. మొన్నటివరకు క్లాసులు పీకితే జనాలు చూడరూ అనే ఫీలింగ్ ఉండేది. కాని ఇప్పడు సదరు క్లాసులే కాస్త నైసుగా శ్రీమంతుడిలా తీసుకుంటే కాసులు కురుస్తాయని అందరికీ అర్ధమైపోయింది. సో, మాటల మాంత్రికుడు కూడా అదే బాటలో పయనమవుతాడట.
సమంత, నితిన్ కాంబినేషన్ లో... త్రివిక్రమ్ ఇప్పటికే మూవీ ప్రారంభించాల్సి ఉంది. కాస్టింగ్ కంప్లీట్ అయింది. యాక్టర్స్ యాక్సెప్ట్ చేసేశారు. స్క్రిప్ట్ సిద్ధంగానే ఉంది. అయినా... ఈ మూవీని అఫీషియల్ గా ప్రకటించలేదు మాంత్రికుడు. ప్రీప్రొడక్షన్ పనులు అలా ఉండగానే... తాను అనుకున్న లైన్ ని తీర్చిదిద్దుతున్నాడట. అయితే... ఇది పవన్ కోసమో, మహేష్ కోసమో ఇంకా తెలీలేదు. వీళ్లిద్దరిలో ఎవరైనా సరే... త్రివిక్రమ్ అడిగితే ఎన్ని డేట్స్ ఇచ్చేస్తారు. కానీ స్క్రిప్ట్ డిమాండ్ ని బట్టే హీరోని ఎంచుకునే మాంత్రికుడు.. ఎవరికోసం పెన్ పవర్ చూపిస్తున్నాడో?