ఈ త్రివిక్రమ్‌ మజిలీ కథలున్నాయే...

Update: 2015-07-15 13:44 GMT
ఒక స్టార్‌ డైరక్టర్‌.. బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు హిట్లు.. 50 కోట్లకు పైగా కలెక్షన్లు.. కట్‌ చేస్తే సీన్‌ ఎలా ఉండాలి? పెద్ద పెద్ద స్టార్లు వెంటపడుతూ, ఈయనతో సినిమాకోసం వారి తపించేస్తూ ఉండాలి. కాని ఇక్కడ సీనంతా రివర్స్‌ లో ఉంది. ఈ త్రివిక్రమ్‌ ఉన్నాడు చూడండి.. బ్యాడ్‌ ప్లానింగ్‌ అని చెప్పాలో లేకపోతే ఆయనకు అనుకోకుండా అలా జరిగిందని చెప్పాలో తెలియదు కాని, ఒక్క సినిమా కూడా సరిగ్గా మెటీరియలైజ్‌ కావట్లేదు.

మొన్నటికి మొన్న నితిన్‌తో సినిమా అన్నారు. ఆ తరువాత స్వయంగా నిర్మాత రాధకృష్ణ నాగచైతన్యతో త్రివిక్రమ్‌ తదుపరి సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. రెండింటిలో ఒక్కటి కూడా ప్రకటనలకు కాని ప్రెస్‌ నోట్లకు కాని నోచుకోలేదు. కట్‌ చేస్తే గౌతమ్‌ మీనన్‌ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకొని చైతూ ఖాళీగానే ఉన్నాడు, పూరి జగన్‌ సినిమాను ఆపేసి నితిన్‌ కూడా ఖాళీగానే ఉన్నాడు. వీళ్లిద్దరిలా త్రివిక్రమ్‌ కూడా ఖాళీగానే ఉన్నాడు. ఇకపోతే ఇప్పుడు కొత్తగా సూర్యతో సినిమా అనే టాక్‌ వచ్చేసింది.

నిజానికి సూర్యతో మనోడు సినిమా తీసినా తీయకపోయినా కూడా.. అసలు తెలుగులో పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేసిన త్రివిక్రమ్‌ సడన్‌గా ఇలా సో అయ్యాడేంటి అనే కన్ఫ్యూజన్‌ ఎక్కువగా ఉంది. పవన్‌, మహేష్‌, చరన్‌, బన్నీ, ఎన్టీఆర్‌.. ఇలా అందరూ బిజీగా ఉండటంతో మనోడు ఎవరితో చేయాలో తెలియక సతమతం అవుతున్నట్లున్నాడు. ఇదేదో కాశీ మజిలీ కథలా ఉంది మరి. ఇంతకీ తదుపరి సినిమా ఎవరితో త్రివిక్రమ్‌?
Tags:    

Similar News