త్రివిక్రమ్ ప్రొడక్షన్లో మరో యంగ్ హీరో?

Update: 2017-02-27 06:51 GMT
స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ ఈ మధ్యన తన సినిమాల డైరక్షన్ కంటే కూడా ప్రొడక్షన్ పైనే ఫోకస్ పెట్టినట్లున్నాడు. అఫీషియల్ గా ఒక్క సినిమాను కూడా తన సొంత బ్యానర్ అంటూ ఏదీ మొదలెట్టి చేయకపోయినా కూడా.. ప్రొడ్యూసర్ చినబాబుతో కలసి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై.. అలాగే  సితార ఎంటర్టయిన్మెంట్ బ్యానర్ పై ఈయనే సినిమాలు  తీస్తున్నాడనేది ఒక రూమర్.

ఈ మధ్యనే నితిన్ హీరోగా లిరిసిస్ట్ కృష్ణ చైతన్య డైరక్షన్లో ఇప్పుడు త్రివిక్రమ్ ఒక సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాను స్వయంగా పవన్ కళ్యాణ్‌ సమర్పించడం విశేషం. అయితే ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ ఇప్పుడు మరో యంగ్ హీరోతో సినిమా చేయబోతున్నాడనేది టాక్. ఆల్రెడీ కొత్త కుర్రాడు చంద్రమౌళి డైరక్షన్లో రాధ సినిమాను రెడీ చేస్తున్న శర్వానంద్.. ఇప్పుడు త్రివిక్రమ్ ప్రొడక్షన్లో చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారట.

అయితే శర్వానంద్ చేయబోయే సినిమా త్రివిక్రమ్ సొంత బ్యానర్లోనా.. లేకపోతే హారిక అండ్ హాసిన బ్యానర్లోనా.. లేకపోతే సితార ఎంటర్టయిన్మెంట్స్ లోని అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News