ఒక కన్నడ సినిమాను సరైన స్టాండర్డ్ లో తీస్తే ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో నిరూపించిన కెజిఎఫ్ సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. తెలుగు హింది తమిళ్ అనే భేదం లేకుండా బయ్యర్లందరూ మంచి లాభాలు కళ్ళజూసారు. ఇప్పటికిప్పుడు సెకండ్ పార్ట్ బిజినెస్ అనౌన్స్ చేస్తే నాలుగింతలు ఎక్కువ రేట్ పెట్టి కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారు. అర్ధ శతదినోత్సవానికి దగ్గరలో ఉన్న కెజిఎఫ్ నిన్న అర్ధరాత్రి నుంచి నాలుగు బాషలలో అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చేసింది.
అయితే దీని కన్నా పది రోజుల ముందునుంచి అమెజాన్ ప్రైమ్ తన సోషల్ మీడియా ఫ్యాన్స్ ని కెజిఎఫ్ గురించి తెగ ఊరిస్తూ వెరైటీ తరహా ప్రమోషన్ చేస్తూ బాగానే ఆకట్టుకుంది. అభిమానులు కూడా వీటికి కనెక్ట్ అయిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేసారు. ఇంత కన్నా పెద్ద బ్లాక్ బస్టర్స్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చినప్పటికీ ఇంత వినూత్నంగా ఎప్పుడు పబ్లిసిటీ చేయలేదు. ఆఖరికి కొద్ది గంటల ముందు కూడా ఇంకాసేపే అంటూ ఊరిస్తూ వచ్చింది ప్రైమ్.
కాని ఇది ప్రపంచవ్యాప్త రిలీజ్ కావడంతో ఇండియా కంటే ముందుగా ఇతర దేశాల్లో కెజిఎఫ్ అమెజాన్ ప్రైమ్ యాప్స్ లో అప్ లోడ్ అయిపోయింది. దీంతో పైరసీకారులు 4వ తేది సాయంత్రం కావడం ఆలస్యం తమ సైట్లలో ఒరిజినల్ వెర్షన్ ను పెట్టేసారు. అంతే ఫ్యాన్స్ అమెజాన్ పేజీలోకి వెళ్ళిపోయి ఇక మీరు 5వ తేది అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు మేము ఆల్రెడీ చూస్తున్నాం అంటూ రివర్స్ లో ట్రాల్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి కెజిఎఫ్ ఇలా వీడియో స్ట్రీమింగ్ లో కూడా కొత్త సంచలనం నమోదు చేసింది. ఏ కారణం చేతనో హింది వెర్షన్ మాత్రం అమెజాన్ వాయిదా వేసింది. గత ఏడాది నుంచి బ్లాక్ బస్టర్స్ ను స్ట్రీమ్ చేయడంలో మంచి దూకుడును ప్రదర్శిస్తున్న అమెజాన్ చేతిలో ఇప్పుడు చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి.