ఇది సోషల్ మీడియా జెనరేషన్. కాదేదీ ట్రోలింగ్ కు అనర్హం. అది మహేష్ బాబు అయినా.. పవన్ కళ్యాణ్ అయినా.. మోహన్ బాబు అయినా బాలయ్య అయినా ఎవరూ ట్రోలింగ్ ను మాత్రం తప్పించుకోలేరు. ప్రతి విషయాన్ని ట్రోలింగ్ చేసే నెటిజన్లకు కాస్త స్టఫ్ ఉన్న టాపిక్ దొరికితే ట్రోలింగ్ చెయ్యకుండా ఎలా ఊరుకుంటారు? తాజాగా నందమూరి బాలకృష్ణ 'రూలర్' రిలీజ్ అయింది. సినిమాకు నిరాశాజనకమైన రివ్యూస్.. మౌత్ టాక్ వచ్చింది. దీంతో ట్రోలర్లు రెచ్చిపోయారు.
ఈ సినిమాలోని ఒక పాట లైన్ ను కొంచెం మార్చి "పడతాడు పడతాడు.. మన మీద పడి కుమ్మేస్తాడు" అనే పంచ్ లైన్ బాలయ్యపై సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. "కోకా కోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ" ని మారుస్తూ "కోకా కోలా రూలర్ బాలయ్య సినిమా హారర్" అంటూ మరో సెటైర్ కూడా పడుతోంది. "చూడు ఫస్ట్ హాఫే చూడు.. సెకండ్ హాఫ్ చూడాలనుకోకు చచ్చిపోతావ్" అంటూ ఎవరికి తోచిన సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సూట్ కాని బాలయ్య విగ్గుల గురించి.. కులం పై బాలయ్య క్లాసుల గురించి కూడా ఎన్నో జోక్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవన్నీ బాలయ్య అభిమానులకు ఇబ్బంది కలిగించేవే.
ఇవన్నీ చదివి సెటైర్లు అన్నీ 'రూలర్' కు వ్యతిరేకంగా ఉన్నాయి అనుకోవద్దు. రివ్యూలు చదివి 'రూలర్' ను తక్కువ చేసే ప్రేక్షకులకు వ్యతిరేకంగా బాలయ్య వార్నింగ్ ఇస్తున్నట్టుగా మరో మెసేజ్ కూడా వాట్సాప్ లో తెగ చక్కర్లు కొడుతోంది. "అవసరమా.. రివ్యూ చదివి వెళ్లే మగాడివా..రూలరుకి రివ్యూ ఏంట్రా రూరల్ కే బాల్.. మూస్కుని సినిమా చూడరా హౌలే.." అంటూ ఓ పెద్ద మెసేజ్ ఉంది. ఏదైతేనేం ఒకటి మాత్రం నిజం. బాలయ్య తన కథల ఎంపికను.. డైరెక్టర్లను మార్చడం మాత్రం తక్షణ కర్తవ్యం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారింది. బాలయ్య ఇది గమనిస్తే అభిమానులు కూడా సగర్వంగా తలెత్తుకుంటారు.