అతిలోక సుందరి శ్రీదేవి తనయగా..బోనీకపూర్ వారసురాలిగా జాన్వీ కపూర్ కెరీర్ బాలీవుడ్ లో దేదీప్యమానంగా సాగిపోతుంది. స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మడి వెంట బడా బ్యానర్లే క్యూ కడుతున్నాయి. 'ధడక్' తో మొదలైన ప్రయాణం 'గుడ్ లక్ జెర్రీ' వరకూ అంతా సాఫీగానే సాగిపోతుంది. ఇప్పటివరకూ అమ్మడికి చెప్పుకోదగ్గ భారీ సక్సెస్ లేదు.
కానీ అవకాశాల పరంగా ఢోకా లేదు. ధర్మప్రొడక్షన్స్ లాంటి నయా బ్యానర్లు ఏరికోరి మరీ జాన్వీని ఎంపిక చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాన్వీపై నెపోటిజం పడగ విప్పింది. అతిలోక సుందరి-బోనీకపూర్ కూతురు కాబట్టి ఇండస్ర్టీలో అవకాశాలు కల్పిస్తున్నారంటూ ఓ సెక్షన్ ఆడియన్స్ అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. నెపోటిజం కారణంగా అవకాశాలు చేజిక్కిచుకుంటుందని...అదే లేకపోతే జాన్వీ ట్యాలెంట్ కి అవకాశాలు కల్పించేది ఎవరంటూ విమర్శలు తెరపైకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా వాటిపై జాన్వీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. 'నేను అందంగా ఉండకపోవచ్చు. ట్యాలెంట్ గల నటిని కాకపోవచ్చు. కానీ నాలో కష్టపడే తత్వం ఉంది. కష్టాన్ని నమ్ముకునే ఇండస్ర్టీలోకి అడుగు పెట్టాను. ఇండస్ర్టీ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా అదెంతో కాలం నిలబడదు. ఎంట్రీ వరకే పరిమితం. ఇప్పుడీ స్థాయిలో ఉన్నానంటే కారణం నా లో కష్టపడే తత్వం వల్లే.
వారసత్వం నుంచి స్టార్ డమ్ పొందాలనుకోవడం లేదు. నాకంటూ ఓ ఐడెంటిటీ కావాలి. దానికోసం ఎంతైనాశ్రమిస్తాను. ఏ సినిమా సెట్స్ కి వెళ్లిన 100 శాతం ఎఫెర్ట్ పెట్టి పనిచేస్తాను. ఈ విషయాన్ని పేపరుపై నా రక్తంతో రాసిస్తాను. నా పనితీరుపై సందేహమే అవసరం లేదు. ఒకే పని పదేపదే చేయడం నచ్చదు. ఎక్కడైనా సవాళ్లతో ముందుకు సాగడం అలవాటు.
రోజు కొత్తగా ఏదో విషయం నేర్చుకోవాలి. ఆ తనప నాలో కావాల్సినంత ఉంది. శ్రీదేవి కుమార్తె అనే ఐడెంటిటీ కొంత వరకూ పరిమితం. ఆ తర్వాత అంతా జాన్వీ అనే అనిపించుకోవాలి. లేకుంటే పోటీ ప్రపంచంలో వెనుకబడుతాం' అని చెప్పుసకొచ్చింది.
మొత్తానికి జాన్వీ వ్యాఖ్యలతో తల్లికి తగ్గ తనయగా నిరూపించుకుంది. శ్రీదేవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ర్టీకి వచ్చి పాన్ ఇండియాలో సినిమాలు చేసారు. చివరిగా హిందీ పరిశ్రమలో స్థిరపడి నిర్మాత బోనీకపూర్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.