జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయం అయ్యి చాలా కాలం అయినా కూడా కమర్షియల్ గా ఇంకా ఆమె భారీ బ్లాక్ బస్టర్స్ ను అందుకోలేకపోయింది.. అందే సమయంలో బాలీవుడ్ లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా కూడా మారలేక పోయింది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా మరియు శ్రీదేవి కూతురు అవ్వడం వల్ల ఒకింత పాపులారిటీని ఈ అమ్మడు దక్కించుకుంది.
శ్రీదేవి కూతురు అవ్వడం వల్ల ఇండస్ట్రీలో ఈజీగా ఎంట్రీ దక్కించుకుంది.. కానీ ఇండస్ట్రీలో స్టార్ గా నిలవాలంటే మాత్రం ఈ అమ్మడు కష్టపడాల్సిందే. కానీ ఈమె తీరు చూస్తూ ఉంటే మాత్రం కష్టపడకుండానే స్టార్ అవ్వాలనే తాపత్రయం కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఈ అమ్మడిని అభిమానించే వారు స్వయంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు అందుకు కారణం. ఇటీవల జాన్వీ కపూర్ గుడ్ లక్ జెర్రీ సినిమా డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ కోసం జాన్వీ కపూర్ గత కొన్ని రోజులుగా తెగ హడావిడి తో ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొన్ని వారాలుగా మూవీ ప్రమోషన్స్ కారణంగా బిజీ గా ఉన్నాను.
వరుస ఇంటర్వ్యూల కారణంగా.. ప్రమోషన్స్ కారణంగా నేను ఈ ఇంటర్వ్యూ ఎలా ఇస్తానో తెలియదు. షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఫ్లైట్ ను బుక్ చేశాను. కాని ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. అదే అలసటతో జిమ్ చేశాను. అక్కడ ఏం చేశానో నాకే అర్థం కాలేదు. చాలా నిద్ర మత్తుగా ఉండటంతో జిమ్ లో ఎక్కువ శ్రద్ద పెట్టలేక పోయాను. అందుకే ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావడం లేదని స్వయంగా జాన్వీ చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలయ్యాయి.
శ్రీదేవి ఒకానొక సమయంలో రోజులో రెండు మూడు షిప్ట్ లుగా వర్క్ చేసేవారు. ఒకే సారి రెండు మూడు సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు అయ్యి ఉండి కేవలం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి.. షూటింగ్ కొన్ని గంటల పాటు చేయడానికి ఇబ్బంది పడటం విడ్దూరంగా ఉందంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
స్టార్ కిడ్ గా మీకు ఇండస్ట్రీ లో గుర్తింపు ఉంది. కాని మీరు స్టార్ అవ్వాలంటే మాత్రం కష్టపడాల్సిందే. మీ అమ్మ స్థాయిలో కాకున్నా కనీసం అందులో సగం అయినా మీరు కష్టపడితేనే మీకు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని జాన్వీ ని ఉద్దేశించి నెటిజన్స్ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ ట్రోల్స్ కు జాన్వీ ఎలా సమాధానం ఇస్తుందో చూడాలి.