`వాల్తేరు వీరయ్య` లిరికల్ సింగిల్స్ ఇప్పటికే మార్కెట్ లో సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. బాస్ పార్టీ సాంగ్..శ్రీదేవి సాంగ్ చార్ బాస్టర్స్ గా నిలిచాయి. యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. అంతేనా అంతకు మించి ట్రోలింగ్ సైతం జరిగింది. మెగా ఇమేజ్ తో దూసుకుపోయినా అదే తరహాలో లిరిక్స్ పై ..ట్యూన్స్ పై తమదైన శైలిలో సెటైర్లు వేసారు నెటి జనులు.
`పూనకాలు లోడింగ్` అంటూ మరో మెగా మాస్ సాంగ్ ని కూడా ఈ మధ్యనే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 24 గంటల్లో 8 మిలియన్ రికార్డు వ్యూస్ దక్కించుకుంది. తాజాగా ఈపాట కూడా ట్రోలింగ్ కి గురైంది. సంగీత ప్రియులు పూనకాలు లోడింగ్ ని కాపీ క్యాట్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు . కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన మరొక పాట మధ్య సారూప్యతను గుర్తించారు.
దేవి శ్రీ ప్రసాద్ విండ్-ఆర్గాన్ ఉపయోగించి రూపొందించిన హుక్ సిగ్నేచర్ మ్యూజిక్ బీట్ `90 ML` సినిమా కోసం అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ట్యూన్‌కి సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. బీట్ టైమింగ్ కూడా అదే విధంగా ఉంది. కార్తికేయ సినిమా నుండి డీఎస్పీ ట్యూన్ ఆలోచనను ఎత్తివేసినట్లు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ పూనకాలు అక్కడ నుంచి తెచ్చావా నాయనా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మునుపటి పాటలకన్నా ఈ పాట ట్యూన్ సింక్ అవ్వడంతో మరింత ట్రోలింగ్ కి గురవుతుంది. అయినా మెగా అభిమానులు ఈ ట్రోలింగ్ పై సంతోషంగా కనిపిస్తున్నారు. పాట ఎలా ఉంటే ఏంటి? అందులో అన్నయ్య డాన్సులు ఇరగదీసాడా? లేదా? అన్నది ఇక్కడ లెక్క అంటూ మరో వర్గం సమర్దిస్తుంది. మొత్తానికి `వాల్తేరు వీరయ్య` పాటల విషయంలో డీఎస్పీ మాత్రం బాగా హైలైట్ అవుతున్నాడు.