పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా ''వకీల్ సాబ్''. హిందీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన 'పింక్' సినిమాకు ఇది రీమేక్. అయితే ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తే.. పవన్ లాయర్ గా కనిపిస్తున్నాడనేది తప్పితే ఏదీ కూడా మాతృకని గుర్తు చేయలేదు. 'పింక్' సినిమా మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ డ్రామా అనే సంగతి తెలిసిందే. అయితే పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని తెలుగులో మార్పులు చేర్పులు చేశారు. ఎన్ని చేంజెస్ చేసినా మెయిన్ థీమ్ మహిళా ప్రాధాన్యతను తగ్గించేలా ఉండబోదని అభిమానులు ఆశించారు. కానీ ఇప్పటి వరకు మహిళలకు సంబంధించిన కంటెంట్ ని రిలీజ్ చేయకపోవడం పట్ల నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ క్రమంలో 'వకీల్ సాబ్' నుంచి 'సత్యమేవ జయతే' అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. థమన్ స్వరపరిచిన ఈ గీతాన్ని శంకర్ మహదేవన్ - పృథ్వీ చంద్ర ఆలపించారు. లిరిసిస్ట్ రామజోగయ్య పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని మంచి సాహిత్యం అందించారు. 'జనం మనిషిరా.. నిజం మనిషిరా.. కష్టమంటే వెంటనే అండగా ఉంటాడు.. అసలు మనిషిరా.. పేదోళ్ల తరఫున నిలబడతాడు..' అంటూ హీరోయిజంని ఎలివేట్ చేసే విధంగా సాగిన ఈ పాట ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే సమయంలో దీనిపై ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇది సినిమాకి సంబంధించిన సాంగ్ లా కాకుండా జనసేన పార్టీ ప్రచారగీతంగా పనికొస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అలానే అందులో 'గెలిపించు ఘనుడురా' అనే లిరిక్ తీసుకొని నెటిజన్స్ మీమ్స్ పెడుతున్నారు. 'పవన్ ఎన్నికల్లో వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించే ఘనుడు మాత్రమే అని.. పోటీ చేసే గెలిచేవాడు కాదు' అని కామెంట్స్ చేస్తున్నారు.
ఏదేమైనా మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులందరూ 'వకీల్ సాబ్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి - నివేదా థామస్ - అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు - బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న 'వకీల్ సాబ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.