బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ పలు విషయాలను తనదైన రీతిలో చమత్కరిస్తుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తాను తండ్రి పాత్ర పోషించినందుకు చాలా ఇబ్బంది పడ్డట్టు వెల్లడించారు.
'దిల్ దడకనే దో' చిత్రంలో ప్రియాంక చోప్రా తండ్రిగా నటించాడు అనిల్ కపూర్. ఆ సినిమాలో ఆమె ఫాదర్ క్యారెక్టర్ వేయాల్సి రావడంతో ఎంతో ఆవేదనకు గురైనట్టు చెప్పుకొచ్చారు అనిల్. దీనికి కారణం ఏమంటే.. గతంలో ప్రియాంక చోప్రాతో అనిల్ రొమాన్స్ చేయడమే. అంతకు ముందు పలు సినిమాల్లో ప్రియాంక చోప్రాతో ఆడిపాడాడు అనిల్. అలాంటిది.. తన తండ్రిగా నటించాల్సి రావడంతో ఎక్కడలేని ఇబ్బంది పడ్డాడట. చివరకు అది సినిమానే కదా అని సర్ది చెప్పుకొని నటించేశాడట.
అదేకాదు.. ఆ తర్వాత వచ్చిన 'మలంగ్' సినిమా విషయంలోనూ ఇదే తరహాలో స్పందించాడు అనిల్. ఆ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్ - దిశా పఠానీ జంట అదర చుంభనాలతో రెచ్చిపోయింది. ఆ సందర్భంగా మీడియా ఓ ప్రశ్న అడిగింది. 'ఇలాంటి కిస్సింగ్ చాన్స్ మీకు లేదని బాధపడుతున్నారా?' అని ఓ రిపోర్టర్ అడిగాడు.
దీనికి అనిల్ బదులిస్తూ.. 'మీరు అడిగిన ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పి.. ఇంటికి వెళ్లి దెబ్బలు తినాలని మీరు కోరుకుంటున్నారా?' అన్నారు. ఆ తర్వాత.. 'నిజం చెప్పాలంటే నాకు కిస్సింగ్ సన్నివేశాల్లో నటించే అవకాశం రానందుకు బాధగానే ఉంది' అని అన్నాడు అనిల్ కపూర్. మరి, ఇది నిజంగా చమత్కారమేనంటారా..?