టాలీవుడ్ కి ఏంటో అన్నీ ఉన్నా ఇబ్బందులు మాత్రం తప్పడంలేదు అంటున్నారు. దానికి కారణం టాలీవుడ్ చుట్టూ రాజకీయం కూడా గుట్టుగా అల్లుకుని ఉండడమే. టాలీవుడ్ లో ఆన్ లైన్ టికెటింగ్ మీద ఇపుడు హాట్ హాట్ చర్చ సాగుతోంది. మొదట్లో స్టార్ హీరోలకే దీని వల్ల ఇబ్బంది అనుకుంటే అది చివరికి అటూ ఇటూ తిరిగి నిర్మాతల మెడకే చుట్టుకుంటోంది. దాంతో ఏపీలో ఉన్న అధికార పార్టీతో చర్చలు సామరస్యంగా జరిపి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు చూస్తున్నారు. దాంతో పాటే పెద్ద సినిమాలకు రిలీజ్ వేళ రేట్లు పెంచుకోవడం కూడా ఉంది. ఈ నేపధ్యంలో మరో మారు టాలీవుడ్ లో పొలిటికల్ హీట్ చెలరేగుతోంది.
ఈసారి టాలీవుడ్ లో మరో బిగ్ ఫ్యామిలీగా ఉన్న నందమూరి కుటుంబం నుంచి వచ్చింది. ఏపీలో విపక్ష నేత చంద్రబాబు కంట కన్నీరు ఒలికింది. ఆయన కుటుంబం మీద వైసీపీ సర్కార్ నేతలు కామెంట్స్ చేశారని, అసెంబ్లీలో అవమానించారన్న దాని మీద నందమూరి కుటుంబం ఒక్కటై ఖండించింది. ఇక ఇప్పటిదాకా వైసీపీ సర్కార్ మీద సీరియస్ కామెంట్స్ చేసి ఎరగని బాలక్రిష్ణ అయితే తన కొత్త సినిమా అఖండలోని భారీ డైలాగులు పేల్చిన రేంజిలో తొక్కి పడేస్తా అన్నట్లుగా గర్జించారు. మేము తలచుకుంటే ఏ వ్యవస్థలు ఏమీ చేయలేబు అంటూ బాలయ్య ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ నిజంగా రాజకీయాన కలకలం రేపుతోంది.
మరో వైపు చూస్తే జూనియర్ ఎన్టీయార్ కూడా ఏపీలో అరాచక పాలన సాగుతోంది అన్నట్లుగా మాట్లాడారు. ఈసారి జనసేన అధినేత, కం సినీ హీరో పవన్ కళ్యాణ్ అయితే బ్యాలన్స్ తోనే కామెంట్స్ చేశారు. తప్పులు అటూ ఇటూ జరుగుతున్నాయని ఆయన పేర్కొనడం విశేషం. అయినా చంద్రబాబు కంట కన్నీరు బాధపెట్టింది అని పవన్ చెప్పేశారు. ఆయన సోదరుడు నాగబాబు కూడా ఇదే తీరున ఏపీ సర్కార్ మీద కామెంట్స్ చేశారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ అయితే చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. మిగిలిన ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దగా ఎవరూ రియాక్ట్ కాకపోయినా వీరంతా వైసీపీ మీద ఇండైరెక్ట్ గా జగన్ మీద చేసిన కామెంట్స్ నేపధ్యంలో టాలీవుడ్ లో మరోసారి చర్చ సాగుతోంది.
ఈ డిసెంబర్ నుంచి మొదలుపెడితే వరసబెట్టి ఆరు నెలల పాటు పెద్ద సినిమాలే లైన్ లో ఉన్నాయి. పెద్ద సినిమాలకు బిజినెస్ ఒక రేంజిలో సాగుతుంది. దాంతో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి కావాలని వారు కోరుతున్నారు. దీని కోసం వీలైతే జగన్ తోనే చర్చించాలని కూడా అనుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీ తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ సినిమా. ఇందులో ఇద్దరు హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్. ఈ ఇద్దరూ కూడా ఏపీలోని రెండు ప్రత్యర్ధి పార్టీలకు ఇండైరెక్ట్ గా మద్దతుదారుగా ఉన్నారని వైసీపీ సర్కార్ అనుకుంటే మాత్రం టికెట్ల రేట్లు పెంచడానికి ససేమిరా అనవచ్చు.
ఇక డిసెంబర్ 2న వస్తున్న అఖండ మూవీ విషయంలో కూడా కొత్త ఆశలు ఏమైనా ఉంటే ఇపుడు ఆలోచించాల్సిందే అంటున్నారు. పవన్ భీమ్లా నాయక్ జనవరి 12న రిలీజ్ అవుతోంది. ట్రిపుల్ ఆర్ కి కనుక అవకాశం ఇస్తే సంక్రాంతి సినిమాలు అన్నింటికీ టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంటుందని ఊహించారు. లేటెస్ట్ గా ఏపీలో మారిన రాజకీయ పరిణామాలు అనివార్యమైన స్థితిలో జూనియర్ సహా బాలయ్య పవన్ స్పందించడంతో ఏపీ సర్కార్ వీటిని ఎలా పట్టించుకుంటుంది అన్నది కూడా చూడాలంటున్నారు. ఒకవేళ దీన్ని పక్కన పెట్టి సానుకూలంగా స్పందిస్తే మాత్రం టాలీవుడ్ బిగ్ ట్రబుల్స్ నుంచి బయటపడినట్లే. అదే జరగాలని అంతా కోరుకుంటున్నారు.