బాలీవుడ్ స్టార్ సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న స్టార్ హీరో సుశాంత్ ఇలా అర్థాంతరంగా జీవితంను ముగించడం వెనుక ఉన్న కారణం ఏంటా అని అంతా ఆలోచిస్తున్నారు. ఆయనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునే స్థాయిలో ఆయన ఆర్థిక పరిస్థితి లేదని ఆయన సన్నిహితులు బలంగా చెబుతున్నారు.
ముంబయిలో ఇల్లు.. ఖరీదైన కార్లు.. బైక్స్.. ఇంకా విలువైన వస్తువులు ఉన్న సుశాంత్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు అయితే పడలేదు. జీవించలేనంత ఆర్థిక పరిస్థితి ఆయనది కాదు. ఆయన డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని సన్నిహితులు అంటున్నారు. కేవలం సుశాంత్ మాత్రమే కాకుండా ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్న ఎంతో మంది స్టార్స్ కూడా ఆర్థిక పరిస్థితి కారణంగా కాకుండా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.
ఉదయ్ కిరణ్ ఆర్థికంగా చితికి పోయినా మరీ పూట గడవనంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆయన ఆఫర్లు లేకపోవడంతో డిప్రెషన్ కు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. సీనియర్ నటుడు రంగనాథ్ తనకు తోడు ఎవరు లేరనే డిప్రెషన్ తో మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది స్టార్స్ అప్పుడప్పుడు డిప్రెషన్ కు లోనవుతూ ఉంటారు. షూటింగ్ సమయంలో చుట్టు వందల మంది ఉన్నా కూడా కొందరు స్టార్స్ ఒంటరి అనే ఫీలింగ్ తో డిప్రెషన్ కు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు.
డిప్రెషన్ అనిపించిన సమయంలో స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో గడపడం ఎక్కువ సమయం పని చేయడం లేదంటే ఎక్కువగా నలుగురిలో ఉండేందుకు ప్రయత్నించడం చేస్తే కొంత అయినా డిప్రెషన్ ను దూరం చేసుకోవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే కూడా తాను ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కాని దాని నుండి బయట పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఆర్థిక పరమైన సమస్యలతో కాకుండా డిప్రెషన్ కారణంగానే సెలబ్రెటీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనేది వాస్తవం.