క్ల్రాసిక్ సాంగ్ ని నాశనం చేసేసారు

Update: 2023-01-20 12:59 GMT
కొన్ని క్లాసిక్ సాంగ్స్ ని అస్సలు టచ్ చేయకపోవడం బెటర్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. వాటిని టచ్ చేసి రీమేక్ చేసే ప్రయత్నం చేస్తే అందులో ఉన్న ఫీలింగ్ పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని ఎప్పటికి కూడా కాపీ చేయకూడదు. ఈ విషయాన్ని సెలబ్రిటీలు కూడా చెబుతారు. రామ్ చరణ్ కెరియర్ ఆరంభంలో చిరంజీవి హిట్స్ సాంగ్స్ కొన్ని రీమేక్ చేశారు.

ఎప్పుడైతే ఆ సాంగ్స్ పై నెగిటివిటీ వచ్చిందో అప్పటి నుంచి రీమేక్ చేయడం ఆపేశారు. అయితే బాలీవుడ్ లో ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం పాత సినిమా సాంగ్స్ ని రీమేక్ చేస్తూ ఉంటారు. వాటిపై నెగిటివిటీ వచ్చిన చేస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే తాజాగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ స్టెబిన్ బెన్ పాడిన ఒక సాంగ్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మహేష్ భట్ దర్శకత్వంలో నాగార్జున, మనిషా కోయిరాలాపై చిత్రీకరించిన తెలుసా మనసా అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సాంగ్ ని ఎంఎం కీరవాణి స్వరపరచగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.

ఇక ఈ సాంగ్ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యింది. క్రిమినల్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ సాంగ్ మాత్రం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది.

అయితే ఆ సాంగ్ ని ఇప్పుడు రీమేక్ చేసి ప్రైవేట్ ఆల్బమ్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సాంగ్ లో లారీసా బోనిస్, ఆసీస్ కసూర్ నటించాగారు. స్టెబిన్ బెన్ ఈ సాంగ్ ని ఆలపించాడు. అయితే ఈ సాంగ్ చూసిన అందరూ కూడా ఒరిజినల్ ఫీల్ ని చెడగొట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మాస్టర్ పీస్ సాంగ్స్ ని ఇలా రీమేక్ చేసి చెడగొట్టకండి అని కొంత మంది నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం సాంగ్ అద్బుతంగా ఆవిష్కరించారు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సాంగ్ పై ముందుగానే సింగర్ స్టెబిన్ బెన్ ఒరిజినల్ సాంగ్ ప్రేమికులకి రిక్వస్ట్ చేసాడు. ఆ సాంగ్ మీద ఉన్న ప్రేమతో నా స్టైల్ లో రీమేక్ చేసే ప్రయత్నం చేసానని, దీనిని స్వాగాతించాలని కోరుకున్నాడు. ఏది ఏమైనా ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఒరిజినల్ సాంగ్ ఫీల్ అయితే రీమేక్ సాంగ్ లో పూర్తిగా మిస్ అయ్యిందని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News