లైట్ దెబ్బతో టైగర్ కు వణుకుతున్నాడే

Update: 2017-07-04 09:13 GMT
వరస విజయాలు వరిస్తున్నప్పుడు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. రేంజ్ బాగా పెరిగిపోయిందని ఫీలవనూ వచ్చు. కానీ గట్టి ఎదురుదెబ్బ తగిలాక నేలకు దిగిరావాల్సిందే. అపజయం నేర్పే పాఠం కాస్త చేదుగానే ఉంటుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు రీసెంట్ గా ఇదే అనుభవం ఎదురైంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో చేసిన ట్యూబ్ లైట్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది.

కబీర్ ఖాన్ డైరెక్షన్ లో సల్మాన్ ఇంతకు ముందు  ఏక్ థా టైగర్ - భజరంగీ భాయిజాన్ సినిమాలు చేశాడు. ఈ రెండూ సూపర్ హిట్లు కావడంతో ట్యూబ్ లైట్ సినిమా రైట్స్ ను భారీ రేట్లకు విక్రయించారు. తీరా సినిమా ఫలితం తేడా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు మునిగిపోయారు. ఏక్ థా టైగర్ సీక్వెల్ గా టైగర్ జిందా హై టైటిల్ తో సల్మాన్ తర్వాత సినిమా చేయబోతున్నాడు. ఈమధ్య సల్మాన్ ఫాంలో ఉండటంతో టైంగర్ జిందా హై సినిమా రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లంతా భారీగానే డబ్బులు పెట్టుబడి పెట్టారు. ట్యూబ్ లైట్ ఫలితం చూశాక అగ్రిమెంట్లను తిరిగి రాయించాలని  వారంతా పట్టుపడుతున్నారు. ట్యూబ్ లైట్ డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటానని ఇప్పటికే సల్మాన్ ప్రకటించినా వారు మాత్రం అగ్రిమెంట్లు మార్చాలస్సిందే అంటున్నారు. టైగర్ జిందా హై శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న స్టార్ టీవీ కూడా పునరాచనలో పడిందని టాక్.  ట్యూబ్ లైట్ ఫలితం నేపథ్యంలో అగ్రిమెంట్ రివైజ్ చేస్తామంటోంది.

అన్ని వైపుల నుంచి ఒకే రకమైన డిమాండ్ వస్తుండటంతో సల్మాన్ కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ ఫ్లాపు కళ్లజూడకపోవడంతో ఏం మాట్లాడలేకపోతున్నాడు.  ఆఖరుకు తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడు.  ట్యూబ్ లైట్ మరీ ఇలా కళ్లు మసకబారేంత దెబ్బ కొడుతుందని తను మాత్రం ఎక్స్ పెక్ట్ చేశాడా ఏంటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News