నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''టక్ జగదీష్''. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని చివరకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసారు.
'భూదేవిపురం గురించి మీకో కథ చెప్పాలి' అంటూ వీరేంద్ర అనే విలన్ గా డేనియల్ బాలాజీ ని చూపించడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఫ్యామిలీని పిచ్చిగా ప్రేమించే జగదీష్ నాయుడు అనే యువకుడి కథే ఈ చిత్రమని తెలుస్తోంది. ఆప్యాయతలు అనుబంధాలతో హ్యాపీగా ఉన్న ఓ ఫ్యామిలీలో, కుటుంబ పెద్ద మరణించిన తర్వాత అన్నదమ్ముల మధ్య వచ్చే ఘర్షణలను.. వారి మధ్య బలమైన భావోద్వేగాలను ఇందులో చూపించారు. అదే సమయంలో వారిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కదా అనే సందేహాలు కలిగించేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు.
జగదీష్ తండ్రిగా నాజర్ కనిపిస్తుండగా.. అన్న బోసుగా జగపతిబాబు నటించారు. నాని ప్రేయసి గుమ్మడి వరలక్ష్మిగా రీతూ వర్మ నటించగా.. మరదలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా ఈ సినిమాలో యాక్షన్ కూడా కావాల్సినంత ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. భూకక్షలు లేని భూదేవి పురాన్ని చూడాలనే తన తండ్రి కోరికను నెరవేర్చే బాధ్యత తీసుకున్న హీరో.. విలన్స్ ఫైట్ చేయడాన్ని చూడొచ్చు. టైటిల్ కు తగ్గట్టుగానే ట్రైలర్ ఆసాంతం నాని టక్ చేసుకునే కనిపిస్తున్నాడు. మరోసారి తనదైన శైలిలో నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.
'అయినోళ్ళ కంటే ఆస్తులు పొలాలు ఎక్కువ కాదు.. రక్తసంబంధం విలువ తెలుసుకో' వంటి డైలాగ్స్ అలరిస్తున్నాయి. మొత్తం మీద డైరెక్టర్ శివ నిర్వాణ మొదటి నుంచీ చెబుతున్నట్లే 'టక్ జగదీష్' చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నాయని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. దీనికి గోపీ సుందర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల పల్లెటూరి అందాలను అద్భుతంగా తెరపైన ఆవిష్కరించారు.
'టక్ జగదీష్' చిత్రంలో సీనియర్ నరేష్ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. నేపథ్య సంగీతం కోసం గోపీ సుందర్ ని తీసుకున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటింగ్.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. 'నిన్నుకోరి' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాని - శివ నిర్వాణ కాంబోలో వస్తోన్న ''టక్ జగదీష్'' ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
Full View