బిజీ బిజీ.. జులాయి మమ్మీ

Update: 2015-07-06 07:21 GMT
అమ్మ, అత్త పాత్రల్లోనూ గ్లామర్‌ కోసం వెతుకుతున్నారు తెలుగు ప్రేక్షకులు. అందుకే మన దర్శకులంతా అలనాటి మేటి నాయికలందరినీ ఏరి కోరి ఎంచుకుంటున్నారు. త్రివిక్రమ్‌, కొరటాల శివ, శ్రీకాంత్‌ అడ్డాల ఇలా దర్శకులంతా మమ్మీల్లోనూ గ్లామరస్‌ మమ్మీల్ని వెతుకుతున్నారు. ఎదిగొచ్చిన బిడ్డడికి అమ్మలు కూడా అంతే గ్లామరస్‌గా ఉండాలని మన దర్శకులు కోరుకుంటుండడంతో బోలెడు మందిని అవకాశాలు వరిస్తున్నాయి.

అదే తీరుగా అలనాటి నాయిక తులసి కూడా తల్లి పాత్రల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పటికే డార్లింగ్‌ సినిమాలో ప్రభాస్‌కి, జులాయిలో అల్లు అర్జున్‌కి మమ్మీగా నటించిన తులసి ప్రస్తుతం మహేష్‌ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్‌ శ్రీమంతుడులో ఓ కీలక పాత్రలో నటించాను. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలోని బ్రహ్మూెత్సవంలోనూ నటంచనున్నానని తులసి చెప్పారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ గారి ఇంటికి ప్రతియేటా వెళుతుంటా. ఇప్పటికే చాలా సార్లు మహేష్‌ పుట్టినరోజు వేడుకలకు వెళ్లాను. ఆ కుటుంబంతో నా అనుబంధం విడదీయరానిదని తులసి చెప్పారు. అలాగే మన దర్శకులు  తెలుగు సినిమాల్లో గ్రామీణ భారతాన్ని చూపించడం బావుంది అంటోంది తులసి.

త్రివిక్రమ్‌, కొరటాల, శ్రీకాంత్‌ అడ్డాల వంటి దర్శకులు గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ కథలు రాసుకుంటున్నారు. ఈ సీనియర్‌ నటి 'శంకరాభరణం తులసి' గా పాపులర్‌. ఆ చిత్రంతోనే బాలనటిగా అందరికీ సుపరిచితమైన తులసి అనతికాలంలోనే నాయికగానూ పాపులర్‌ అయ్యారు.

Tags:    

Similar News