-హాయ్ పూరీగారూ.. బాగున్నారా? ఇస్మార్ట్ గా ఉన్నారా!
హా బాగున్నానండీ (నవ్వుతూ), మీరు బాగున్నారా?
-గుడ్ సార్, ఈ సినిమాతో పాత పూరీ జగన్నాథ్ ను చూడగలమా? మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టేనా?
కచ్చితంగా. 'టెంపర్' తర్వాత హిట్ లేని లోటు ఈ సినిమాతో భర్తీ అవుతుంది.
-ఈ సినిమాకు ఇప్పటి వరకూ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి? టీజర్, ట్రైలర్ ల విషయంలో వచ్చిన బెస్ట్ రెస్సాన్స్ ఏదైనా ఉందా?
బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అది సెన్సార్ బోర్డ్ నుంచి అందింది. ఈ సినిమాను వాళ్లు ఆసాంతం చూశారు కదా.. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా ఉంది అని వారు చెప్పారు. అదే ఇప్పటి వరకూ అందిన కాంప్లిమెంట్. విడుదల అయ్యాకా ప్రేక్షకుల నుంచి కూడా అదే స్థాయి రెస్పాన్స్ ఉండటం గ్యారెంటీ.
-'ఇస్మార్ట్ శంకర్' హీరోయిజం ఏమిటి? పూరీ జగన్నాథ్ ఫీచర్ ఫిల్మ్స్ తీయడం మేనేశారు, తనకు తోచిన ఫిలాసఫీ తో హీరో క్యారెక్టరైజేషన్ చేస్తూ సినిమాలను తీసేస్తున్నాడు అనే కంప్లైంట్ ఒకటి ఉంది మీమీద. దాని మీద ఎలా స్పందిస్తారు?
కంప్లైంట్ లు చేసే వాళ్లు జీవితంలో అవి మాత్రమే చేయగలరు. వాళ్లు అంతకు మించి ఏం చేయలేరు. నా సినిమాల్లో హీరోలతో సొసైటీకి రాంగ్ మెసేజ్ ఇస్తానని అనడం అబద్ధం. 'బిజినెస్ మ్యాన్' సినిమాతో కూడా అలాంటిదేమీ జరగలేదు. ఆ సినిమా అర్థం కాక కొంతమంది అలా అంటారేమో. ఆ సినిమాను బాంబే ఫిల్మ్ స్కూల్ వాళ్లు తమ సిలబస్ లో పెట్టారు. ఏమైనా తేడా గా ఉండుంటే అలా పెట్టరు కదా!
-'ఇస్మార్ట్ శంకర్' ఎలా ఉండబోతోంది?
పక్కా కమర్షియల్ సినిమా అండీ. 'సీటీ మార్' అంటారు కదా.. అలాంటి సినిమా. ఆద్యంతం ఫుల్ ఎంటర్ టైనర్. ఇంకో మాట లేదు.
-ఈ సినిమా ప్రమోషన్ లో హీరో రామ్ కనిపించడం లేదేంటి!
అలాంటిదేమీ లేదండీ, తను ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సినిమాను ప్రమోట్ చేశాడు. ముందే షెడ్యూల్ అయి ఉండటంతో అబ్రాడ్ వెళ్లాడు. తను ముందే ఫిక్స్ చేసుకున్న టూర్ అది. ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు.
-పూరీ హీరోయిన్ల అంటే వాళ్లకు ప్రత్యేకత ఉంటుంది. మీ సినిమాల తర్వాత చాలా మంది హీరోయిన్లు స్టార్లు అయ్యారు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ల గురించి…
నభా నటేష్, నిధీ అగర్వాల్ ఇద్దరూ చాలా బాగా చేశారు. ఒకరిది మాస్ క్యారెక్టర్ ఇంకొకరిది డీసెంట్ క్యారెక్టర్. ఇద్దరికీ మంచి గుర్తింపు వస్తుంది.
-మీ నెక్ట్స్ పిక్చర్స్ ఏంటి సార్..
ఇంకా ఏవీ కన్ఫర్మ్ కాలేదు. మా అబ్బాయి హీరోగా ఒక సినిమాను తీస్తున్నా. దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నా. వేరే దర్శకుడు ఆ సినిమాను రూపొందిస్తున్నాడు. అదొక రొమాంటిక్ లవ్ స్టోరీ.
-అంటే అది పూరీ రాసిన ప్రేమకథేనా..
హా.. అలాంటిదేనండీ(నవ్వుతూ)
-చార్మిగారూ.. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా సెటిలైపోతారా? వేరే దర్శకులతోనూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారా?
ఈ సినిమా హిట్ అయితే అంతా సెటిలైపోతారండీ..(నవ్వుతూ)
-ఓకే సార్, థ్యాంక్యూ. ఆల్ ద బెస్ట్.
థ్యాంక్స్ అండీ.