కంగనా వ్యాఖ్యలకు గాంధీ మునిమనవడి కౌంటర్

Update: 2021-11-18 15:30 GMT
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల భారత స్వాతంత్య్యాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిందే అసలైన స్వాతంత్ర్యం అంటూ నోరుపారేసుకుంది. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లకు గాంధీజీ మద్దతు లభించలేదని.. అందుకే ప్రజలు తెలివిగా ఆలోచించి గాంధీకి మద్దతు ఇస్తారా? లేదా? నేతాజీకి మద్దతు ఇస్తారా? అనే విషయం తేల్చుకోవాలని సూచించారు.  అంతకుముందుది స్వేచ్ఛ కాదని తెలిపింది.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎవరైనా ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలంటూ గాంధీ చెప్పిన సూత్రాన్ని బుధవారం నాడు కంగనా విమర్శించింది. గాంధీ చెప్పిన సిద్ధాంతంతో మనం స్వాతంత్ర్యం పొందామని తనకు ఎవరో చెప్పారని.. అలా అజాది రాదని కంగా ఓ పోస్ట్ చేసింది.

అయితే కంగనా వ్యాఖ్యలపై గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ స్పందించారు. గాంధేయవాదులు మాత్రమే రెండో చూపిస్తారని కొందరు ఆరోపిస్తున్నారని.. కానీ మరో చెంప చూపించడానికి గాంధీ ద్వేషులకు అనుకున్న దాని కంటే ఎక్కువ ధైర్యం కావాలని తుషార్ గట్టిగా సమాధానమిచ్చారు. వాళ్లు వీరత్వాన్ని అర్థం చేసుకోలేని పిరికి పందలు అని.. అసమర్థులు అని విమర్శించారు.

అనాటి భారతీయులు రెండో చెంప చూపించి ఎంతో ధైర్యాన్ని చూపించారని.. అందుకే వీరంతా హీరోలు అయ్యారని తుషార్ అన్నారు.

భిక్షగాడు అని పిలవడాన్ని బాపూజీ స్వాగతించరని.. తన దేశం, తన ప్రజల కోసం అలాంటి మాటలను గాంధీ పట్టించుకోలేదని తుషార్ గుర్తు చేశారు. అబద్ధాలను ఎంత బిగ్గరగా అరిచి చెప్పినా నిజం నిలకడగా ఉంటుందని హితవు పలికారు. అయితే అబద్ధాన్ని స్పందిస్తేనే నిజాలు తెలుస్తాయన్నారు. ఇలా కంగనా వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురుస్తోంది.
Tags:    

Similar News