ఒకప్పుడు పెళ్ళికాకుండా తల్లవ్వడం అనేది ఒక పెద్ద బూతులా చూసేది సొసైటి. ఆ తరువాత సుస్మితా సేన్ వంటి హీరోయిన్లు.. ఆడపిల్లలను ఎడాప్ట్ చేసుకుని తల్లులుగా మారారు. ఆ తరువాత అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు.. రీసెంటుగా షారూఖ్-గౌరీ ఖాన్ లు.. పోతే తెలుగులో నటి లక్ష్మీ మంచు.. సరోగసి (అద్దె గర్భం) పద్దతి ద్వారా పేరెంట్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ అందరూ హీరోయిన్లే అలా చేస్తున్నారు కాని.. హీరోలు మాత్రం పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. కాని పెళ్లి చేసుకోకుండా తన సొంత స్పర్మ్ తో ఐ.వి.ఎఫ్ పద్దతి ద్వారా ఒక బిడ్డను కన్నాడు బాలీవుడ్ హీరో తుషార్ కపూర్.
వెటరన్ హీరో జితేంద్ర కొడుకుగా.. హీరో తుషార్ అంతగా ఫేమస్ కాలేదులేండి. ప్రస్తుతమైతే వాళ్ళక్క ఏక్తా కపూర్ తీసే సినిమాల్లోనే కనిపిస్తున్నాడు. బయట ఎవ్వరూ ఆఫర్లు ఇవ్వట్లేదు. ఇక మనోడు హీరోయిన్ నర్గీస్ ఫక్రీతో ప్రేమలో పడ్డాడనే రూమర్లు అప్పట్లో తెగ వచ్చాయి. అవన్నీ ఏమో కాని.. ఇప్పుడు మాత్రం ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్దతిలో.. సరోగసీ ద్వారా.. 'లక్ష్యా' అనే కుర్రాడికి తండ్రయ్యాడు. ఈ పిల్లాడిని ఒక తల్లిలా అద్భుతంగా పెంచుతాను అంటున్నాడు. ఒక్కసారిగా బాలీవుడ్ ఈ వార్త విని షాకైంది కాని.. అసలు పిల్లలను ఇలా కూడా కని పెంచుతారా అంటూ అవాక్కయ్యి.. తుషార్ కు అభినందనలు చెబుతున్నారు.