చిత్రవిచిత్రమైన ఉదంతాలకే కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది పశ్చిమబెంగాల్ రాష్ట్రం. ప్రముఖులు.. సినీ నటులు.. సెలబ్రిటీలు తరచూ కోల్ కతా మహానగరంలో ఇబ్బందులకు గురి అవుతారన్న విమర్శలకు తగ్గట్లు పలు ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
కోల్ కతాలోని కస్బా అనే ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకోవటానికి తన కారుతో వచ్చారు ప్రముఖ టీవీ నటి. రూ.1500 పెట్రోల్ పోయాలని చెప్పగా.. అక్కడి సిబ్బంది అంతకుమించి పెట్రోల్ పోశారు. దీంతో.. తాను చెప్పిన దాని కంటే పెట్రోల్ ఎక్కువ ఎందుకు పోశారని ప్రశ్నించగా.. వారి నుంచి సమాధానం సరిగా రాలేదు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం మొదలైంది.
ఒకదశలో పొరపాటు జరిగినట్లుగా ఒప్పుకుంటూనే.. డబ్బులు ఇవ్వాల్సిందేనని చెప్పటం.. కారు తాళం లాగేసుకోవటంతో ఇష్యూ మరింత ముదిరింది. ఫోన్లో పోలీసులకు సదరు నటి ఫిర్యాదు చేయటంతో ఖాకీలు అక్కడకు వచ్చారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణను సద్దుమణిగించారు. పెట్రోల్ బంక్ సిబ్బంది తన పట్ల సరిగా వ్యవహరించలేదని.. తనపై దాడి చేసినట్లుగా ఆమె ఆరోపించారు. తాను ఎదుర్కొన్న పరిస్థితి మీద సదరు నటి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై బంకులోని సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఏమైనా.. తప్పు చేసి దబాయించటమే కాదు..దాడికి యత్నించిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు.