హీరోపై టీవీఛాన‌ల్ అనుచిత వ్యాఖ్య‌లు.. సెల‌బ్రిటీల ఆగ్ర‌హం

Update: 2021-05-28 07:30 GMT
మెజారిటీ మీడియా రాజ‌కీయాల‌కు కొమ్ముకాస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఎంతోకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. త‌మ అనుకూల పార్టీల నిర్ణ‌యాల‌కు ఎవ‌రు వ్య‌తిరేకంగా మాట్లాడినా.. దుమ్మెత్తిపోవ‌డం అల‌వాటుగా మారిపోయింది. ల‌క్ష‌దీవుల విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ మాట్లాడిన హీరోపై ఓ టీవీ ఛాన‌ల్ ఇష్టారీతిన నోరుపారేసుకుంది. దీంతో.. స‌ద‌రు టీవీ ఛాన‌ల్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

ల‌క్ష‌దీవుల విష‌యంలో తెచ్చిన కొత్త రెగ్యులేష‌న్స్ ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరుతూ.. న‌టుడు పృథ్విరాజ్‌ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ల‌క్ష‌ద్వీప్ కొత్త అడ్మినిస్ట్రేట‌ర్ ప్ర‌పుల్ ప‌టేల్ కొత్త రెగ్యులేష‌న్స్ ప్ర‌తిపాదించిన విష‌యం తెలిసిందే. దీనికి వ్య‌తిరేకంగా #SaveLakshadweep అంటూ పోరాటం న‌డుస్తోంది. ఈ పోరాటానికి మ‌ద్ద‌తుగా హీరో పృథ్వీ ట్వీట్ చేశారు.

ఆ ప్రాంతంతో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. అభివృద్ధి పేరుతో స్థానికుల‌ను ఇబ్బంది పెట్ట‌డం స‌రికాదంటూ పోస్టు చేశాడు. దీనిపై జ‌నం టీవీ చీఫ్ ఎడిట‌ర్ జీకే సురేష్ బాబు అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. పృథ్విరాజ్ సంఘ వ్య‌తిరేక శ‌క్తుల‌తో క‌లిసి మొరుగుతున్నాడని, ఇలాంటి వ్యాఖ్య‌లు ఎవ‌రు చేసినా స‌రికాదంటూ పోస్టు చేశారు.

దీంతో.. రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖుల‌తోపాటు నెటిజ‌న్లు జ‌నం టీవీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. పృథ్వి చేసిన వ్యాఖ్య‌ల్లో త‌ప్పేంటో చెప్పాల‌ని నిల‌దీశారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ట్వీట్లు చేశారు. వీరిలో విప‌క్ష ఎమ్మెల్యేల‌తోపాటు ప‌లువురు సినీ న‌టులు, ద‌ర్శ‌కులు ఉన్నారు. పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగ‌డంతో.. ఇదేదో తేడాగా ఉంద‌ని భావించిన‌ జ‌నంటీవీ.. త‌న ట్వీట్ ను తొల‌గించుకుంది
Tags:    

Similar News