కార్పొరెట్ కంపెనీలు ప్రిన్స్ మహేష్ వెంటే ఎందుకు క్యూ కడుతున్నాయి? ఇంతమంది హీరోలు ఉండగా అతడి చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయి? అతడితోనే ఎందుకు కోట్లాది రూపాయల కాంట్రాక్టుల్ని కుదుర్చుకుంటున్నాయి? వీటన్నిటికీ సమాధానం చాలా సింపుల్.
హీ ఈజ్ ఏ మ్యాకో. అందగాడు, ఎక్స్ ప్రెషన్ ఉన్నోడు. మగువల గుండెల్లో మారాజు. అమ్మాయిల కలల రాకుమారుడు. యువతరానికి ఐకన్. అతడు అందరికీ ఇన్ స్పిరేషన్. ఆరేళ్ల బాలకుల నుంచి 90ఏళ్ల వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ మహేష్ ని అభిమానిస్తారు. హీరో అంటే ఇలా ఉండాలి అని భావిస్తారు కాబట్టే ఇప్పుడున్న హీరోల్లోనే అతడు నంబర్- 1 అయ్యాడు. అందరూ అభిమానించే హీరో కాబట్టే కార్పొరెట్ అతడిని కాసులు కురిపించే మొనగాడిగా భావిస్తోంది.
అందుకే ఇప్పటికే ప్రతిష్ఠాత్మక బ్రాండ్ లన్నీ అతడి ఖాతాలోకి చేరాయి. దమ్సప్ కి ప్రచారం చేసినా, జాయ్ అలుక్కాస్, టాటా స్కై వంటి ప్రఖ్యాత బ్రాండ్ లకు ప్రచారం చేసినా ఇదంతా అతడికే సాధ్యమైంది. ఒక్కో ప్రొడక్ట్ కి కోట్లలో పారితోషికం ముడుతోంది. తాజాగా అతడి ఖాతాలోకి టీవీఎస్ కంపెనీ కూడా చేరింది. ఈ కంపెనీ కొత్త బైక్ టీవీఎస్ ఫీనిక్స్ 125 సీసీ ప్రచారంలో దుమ్ము రేపేస్తున్నాడు. నిన్న ప్రిన్స్ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెబుతూ ఆ రకంగానూ బోలెడంత ప్రచారం కొట్టేసింది టీవీఎస్ కంపెనీ.
మహేష్ జీవితంలో ప్రతి సందర్భం కార్పొరెట్ కి కాసులు కురిపించే వరం. అందుకు ఈ పుట్టినరోజు ప్రచారమే ఉదాహరణ.