'క‌శ్మీర్ ఫైల్స్' ని కించ‌ప‌రిచిన ట్వింకిల్ ఖాన్నా!

Update: 2022-04-05 14:30 GMT
ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన బాలీవుడ్ చిత్రం `క‌శ్మీర్ ఫైల్స్` సంచ‌ల‌నాలు నమోదు చేసిన‌ సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డ చూసినా ఈ సినిమా గురించే చ‌ర్చ సాగుతుంది. సినిమాలో కంటెంట్..వివాదాస్ప‌ద అంశాలు సినిమాని తొలి షో అనంత‌రం అలా అమాంతం పైకి లేపాయి. 12 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన సినిమా  300 కోట్ల గ్రాస్  వ‌సూళ్ల‌ని సునాయాసంగా ఛేదించింది.

ఎవ‌రు చూస్తారు? అని  ఈ సినిమాని  విమ‌ర్శించిన నోళ్లే ఇప్పుడు ప్ర‌శ‌సంలు కురిపిస్తున్నాయి. లో బ‌డ్జెట్ సినిమా..నెల రోజుల్లో షూటింగ్ పూర్తిచేసారు.. సినిమాలో ఏముంది? సెన్సార్ బోర్డు ద‌గ్గ‌ర ఇబ్బందులు.. ఇలా ఎన్నో అవాంత‌రాలు ఎదుర్కుని రిలీజ్ అయిన  `క‌శ్మీర్  ఫైల్స్` నీరాజ‌నాలు అందుకుంటుంది. ఈసినిమాని మెచ్చ‌ని ప్రేక్ష‌కుడు లేడు.  దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ సైతం ఈ సినిమాకి ఫిదా అయిపోయారు. సినిమాని  ఉద్దేశించి ప్ర‌శంస‌లు కురిపించారు. అంత‌గా సినిమాకి క‌నెక్ట్ అయ్యారు.

అయితే ఈ సినిమా బాలీవుడ్ న‌టి..కాల‌మిస్ట్ ట్వింకిల్ క‌న్నా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. ఓ ఆర్టిక‌ల్ ప్ర‌స్తావ‌న‌లో `క‌శ్మీర్ ఫైల్స్` గురించి ట్వింకిల్ క‌న్నా ఇలా ప్ర‌స్తావించింది. `క‌శ్మీర్ ఫైల్స్` స్ఫూర్తితో చాలా మంది `అంధేరీల ఫైల్స్`..`ఖేర్ దందా ఫైల్స్`.. `సౌత్  బాంబే ఫైల్స్`  వంటి  టైటిళ్ల‌ని నిర్మాత‌లు  రిజిస్ట‌ర్ చేయిస్తున్నారు. ఇలాంటి వాళ్లంతా ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌మ‌ని చెప్పుకుని తిరుగుతున్నారు.

అలాగైతే నేను కూడా `మానిక్యూర్` పై ఓ సినిమా తీస్తాను. `మానిక్యూర్` అంటే చేతి గోళ్లు..వేళ్లు శుభ్రం చేయ‌డం. దానికి `నెయిల్ ఫైల్స్` అని టైటిల్ పెడ‌తానని `క‌శ్మీర్ ఫైల్స్` పై సెటైరిక‌ల్ గా విమ‌ర్శ‌లు గుప్పించింది. దీంతో నెటి జ‌నులు  ట్వింకిల్ ఖ‌న్నా పై ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు.  అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తున్నారు.

`క‌శ్మీర్ ఫైల్స్` లాంటి అరుదైన గొప్ప సినిమాని వెట‌కారం చేస్తావా? అస‌లు నీ అర్హత ఏంటి? అంటూ మండిప‌డుతున్నారు. నీలాంటి వాళ్లు సినిమా చూడ‌క‌పోయినా..పొగ‌డ‌క‌పోయినా వ‌చ్చిన న‌ష్ట‌మేమి లేదు. ప‌బ్లిసిటీ కోసం పిచ్చి కామెంట్లు చేయోదంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. కాగా ఈసినిమాని ట్వింకిల్ ఖ‌న్నా భ‌ర్త అక్ష‌య్ కుమార్ ఆకాశానికి ఎత్తేసిన సంగ‌తి తెలిసిందే.

అలాగే  టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాని ఓ రేంజ్ లో ప్ర‌శంసించారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ ఈవెంట్ లో సినిమా గురించి ప్ర‌స్తావించిన సంగ‌తి  తెలిసిందే. ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  1990లో క‌శ్మీర్ పండిట్ల‌పై జ‌రిగిన దాడుల‌కి వివేక్ అద్భుత‌మైన  దృశ్య‌రూపం ఇచ్చారు.    
Tags:    

Similar News