స్టార్ హీరోల సినిమాలకే కాదు వాళ్ళు వాడిన దుస్తులకు కూడా సులభంగా వెల కట్టలేనంత విలువ ఉంటుంది. అది చాలా సార్లు రుజువయ్యింది కూడా. కాకపోతే ప్రతి సారి వాటిని అమ్ముకోవడం కాని బయట పెట్టడం కాని చేయరు. అప్పుడప్పుడు ఏదైనా మంచి ఉద్దేశంతో చేయాల్సి వస్తే మాత్రం అది అభిమానులకు పండగ లాంటిది అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య మాజీ హీరొయిన్ ట్వింకిల్ ఖన్నా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే అక్షయ్ దుస్తుల వేలం. రెండేళ్ళ క్రితం విడుదలైన రుస్తుం సినిమా ఎంత హిట్ అయ్యిందో తెలిసిన విషయమే. అందులో భార్య చేతిలో మోసపోయి ఆమె ప్రియుడిని కాల్చి చంపిన మిలిటరీ ఆఫీసర్ పాత్రలో అక్షయ్ కుమార్ నటన ప్రేక్షకుల మనసులే కాదు అవార్డులు కూడా గెలుచుకుంది.
ఇప్పుడు అందులో అక్షయ్ కుమార్ వాడిన కాస్ట్యూమ్స్ అన్ని వేలానికి పెట్టింది ట్వింకిల్ ఖన్నా. దాని పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ లెఫ్టినెంట్ కల్నల్ సందీప్ ఆహ్లావట్ అనే సైనికాధికారి ట్వింకిల్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అవి సైనిక దుస్తులు కావని సినిమా కోసం వాడిన కాస్ట్యూమ్స్ అని దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుల భార్యలు ఇలా దుస్తులను వేలం వెయ్యరని ఘాటుగా తిడుతూ ట్వీట్ చేసాడు. ఏకంగా మొహం పగలగొడతా అంటూ తిట్టేసి కోర్ట్ కూడా వెళ్తాను అని బెదిరించేసాడు. చిర్రెత్తుకొచ్చిన ట్వింకిల్ అతని కంటే ముందు తనే కోర్ట్ కు వెళ్తోంది. దాడి చేస్తాను అనే బెదిరింపు చేసినందుకు అతని మీద చర్యలకు ఉపక్రమిస్తోంది. మే చివరి వారం దాకా సాగనున్న వేలంలో ఇప్పటి దాకా 30 కోట్ల పాట పాడుకున్నారు ఫాన్స్.
యానిమల్ ప్రొటెక్షన్ కోసం పాటు పడే ఒక సంస్థ కోసం విరాళంగా ఈ మొత్తాన్ని ఇస్తున్నారు. అవి ఎంత సైనిక పాత్ర దుస్తులే అయినా వాటికి అంత విలువ రావడానికి కారణం అవి అక్షయ్ కుమార్ ధరించడం వల్లే. అంతే తప్ప వేలం వేసే ప్రతి సైనిక యునిఫార్మ్ కు ఎంత వేలం వేసినా అంత ధర రాదు కదా. ఆ లాజిక్ మర్చిపోయి మంచి ఉద్దేశంతో చేసిన ఇలాంటి పనిని కూడా తప్పుబడతారా అంటూ కౌంటర్ వేస్తున్నారు అక్షయ్ ఫాన్స్. నిజమే కదూ.