సినిమాల్లో హీరోయిన్ గా నటించేటప్పుడు రకరకాల సీన్లను చేయాల్సి ఉంటుంది. గ్లామర్ వరల్డ్ లో కాసింత హద్దులు దాటి ప్రవర్తించాల్సి రావడం.. యాక్ట్ చేయడం తప్పనిసరి. ఇక మన దేశంలో సినిమాల్లో హీరోయిన్ కేరక్టర్ల గురించి పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. తెలుగులో శీను వంటి చిత్రాలలో నటించిన బ్యూటీ ట్వింకిల్ ఖన్నా.. ఎక్కువ కాలం సినిమాలు నటించలేదు. కెరీర్ మంచి దశలో ఉండగానే అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.
అయితే.. ప్రస్తుతం రైటర్ గా తన సత్తా చాటుతున్న ఈ భామ.. ఇప్పుడు ప్యాడ్ మ్యాన్ మూవీతో నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకుంటోంది. తన సినిమాలను పిల్లలు చూడాలని అస్సలు కోరుకోదట ఈ భామ. అప్పట్లో తను ఎలాంటి సినిమాలు చేసిందో తెలుసు కాబట్టే.. వాటికి దూరంగా తన పిల్లలు ఉండాలని అనుకుంటుందట. కానీ ఆమె కొడుకు ఆరవ్ భాటియా మాత్రం ఈ విషయంలో మహా ముదురు అంటోంది ట్వింకిల్. ప్రస్తుతం ప్యాడ్ మ్యాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈమె.. కొడుకు చేసే అల్లరి పనులను గురించి కూడా చెబుతోంది. తాజాగా ఆక్స్ ఫర్డ్ లో స్పీచ్ ఇచ్చిన ట్వింకిల్ ఖన్నా.. కొడుకు ఆరవ్ తనను ఎలా ఉడికిస్తాడో చెప్పుకొచ్చింది.
1996లో వచ్చిన జాన్ సినిమాలో హీరో అజయ్ దేవగన్ తో ఈమెకు సన్నిహితమైన సీన్స్ ఉంటాయి. వీటిలో ఒకదాన్లో.. హీరో ఛాతీపై హీరోయిన్ ట్వింకిల్ ముద్దు పెట్టే సీన్ కూడా ఒకటి. ఓసారి ట్వింకిల్ పుట్టిన రోజు ఈవెంట్ నాడు.. ఆ పాటకు సంబంధించిన ఫోటోలతో ఓ కొలాగ్ చేయించి మరీ గిఫ్ట్ ఇచ్చాడట ఈ గడుగ్గాయి. తన కెరీర్ గురించి అభిమానులు భావించినంత గొప్పగా.. తన కుటుంబం భావించదని అంటోంది ట్వింకిల్ ఖన్నా.