'సర్కారు వారి పాట' లాంటి స్టోరీ మళ్లీ రాదు.. థియేటర్ దద్దరిల్లిపోద్ది..!
సూపర్ స్టార్ మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా నటించిన ''సర్కారు వారి పాట'' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'గీత గోవిందం' ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ర్రేపు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేయబడిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు కావాల్సినంత బజ్ తెచ్చిపెట్టింది.
ఎస్ఎస్ థమన్ స్వరపరిచిన పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇటీవల వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ పరశురాం - థమన్ మరియు లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ ట్విట్టర్ స్పేస్ లో SVP చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు.
'సర్కారు వారి పాట' సినిమా ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు బ్రీత్ లెస్ గా ఉంటుందని.. సూపర్ స్టార్ మహేష్ బాబు స్వాగ్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని పరశురాం అన్నారు. ''రెండేళ్లుగా బ్రేక్ పడుతున్నా కూడా ఆ క్యారెక్టర్ ని క్యారీ చేశారంటే మహేశ్ గారు చాలా గ్రేట్. ట్రైలర్ లో చూసింది చాలా తక్కువ. సినిమాలో బాబు ప్రెజెంటేషన్ ఇంకో లెవెల్లో ఉంటుంది'' అని చెప్పారు.
ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ.. పెన్నీ సాంగ్ కు థియేటర్ దద్దరిల్లిపోద్దని అన్నారు. 'కళావతి' పాటలో రెండు మాంటేజెస్ ఉంటాయి.. ముఖ్యంగా అమ్మాయిలకు కనువిందు చేస్తాయి అని తెలిపారు. ముందుగా ఎడిట్ వెర్షన్ రెడీ అవ్వాలని టాకీ పార్ట్ కంప్లీట్ చేసి లాస్ట్ లో 'మా మ మహేష్' సాంగ్ షూట్ చేసాం.. థియేటర్ లో పేపర్స్ బదులు పూలు విసురుతారు అని థమన్ అన్నారు.
'మా మా మహేష్' పాటతో 'మురారి బావ' సాంగ్ ని రీప్లేస్ చేసినట్లు తమన్ వెల్లడించారు. అన్నీ కుదిరితే మురారి బావ పాటను కూడా త్వరలో విడుదల చేస్తామని.. అలానే 'సర్కారు వారి పాట' ర్యాప్ సాంగ్ ని వదలదానికి ప్లాన్ చేస్తున్నామని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో అన్ని పాటలు రాసిన అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. 'మీరు విన్న పాటలు స్టార్టర్స్ మాత్రమే.. సినిమా మాత్రం అందరికీ ఫుల్ మీల్స్ లా ఉంటుంది' అని చెప్పారు. 'సర్కారు వారి పాట' కథలో చాలా డెప్త్ ఉంటుంది.. ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా కుదిరింది. వచ్చే ఐదేళ్లలో ఈ రేంజ్ స్టోరీ మళ్లీ రాదు అని గీత రచయిత అన్నారు.
SVP మేనియా ట్విట్టర్ స్పేస్ లోకి వచ్చిన సీనియర్ నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ.. 'త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పూరి జగన్నాథ్ కలిసి రాస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో పరశురామ్ రాసాడు మరియు తీశాడు. సర్కారు వారి పాట పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది' అని అభిప్రాయం వ్యక్తం చేశారు.