2022 ఎండింగ్ అక్టోబర్ 14న విడుదలైన కన్నడ డబ్బింగ్ మూవీ `కాంతార`. రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించాడు. సప్తమిగౌడ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని `కేజీఎఫ్` మేకర్స్ హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ మూవీ అక్కడ సంచలనాలు సృష్టించింది. ఆ తరువాత అక్టోబర్ 14న తెలుగులో విడుదలై ఇక్కడ కూడా ఊహించని విధంగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో భూతకోల నేపథ్యంలో నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రూ. 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ఇందులో నటించిన నటీనటులని టాక్ ఆఫ్ ద ఇండియాగా మార్చింది. పాన్ ఇండియా స్టార్ల సరసన నిలబెట్టింది. ఫారెస్ట్ రేంజర్ గా నటించిన కిషోర్ కు సోషల్ మీడియా ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆయన అకౌంట్ పై వేటు పడింది. ఆయన ఖాతాని ట్విట్టర్ సస్పెండ్ చేయడంతో కిషోర్ షాక్ కు గురయ్యారు.
`ఆయన ఖాతా సస్పెండ్ అయింది. ట్విట్టర్ నిబంధనల్ని ఉల్లంఘించిన వారి ఖతాలను సంస్థ నిలిపి వేస్తుంది` అని నటుడు కిషోర్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేని వారికి ఈ సందేశం కనిపిస్తూ షాకిస్తోంది. కిషోర్ ఖాతాని ట్విట్టర్ ఎప్పుడు సస్పెండ్ చేసిందన్నది మాత్రం తెలియడం లేదు. ట్విట్టర్ నిబంధనలకు విరుద్ధంగా కిషోర్ ఏ ట్వీట్ ని పోస్ట్ చేశాడనే దానికి పై కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో పలువురు నెటిజన్ లు ఇలా ఎలా జరిగింది? .. ఎందుకు జరిగిందని ఆరా తీస్తున్నారు.
ఇదిలా వుంటే కిషోర్ ట్విట్టర్ ఖాతాను మళ్లీ పునరుద్దరించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ కు ట్యాగ్ చేస్తూ పలువురు నెటిజన్ లు కిషోర్ ఖాతాని పునరుద్దరించాలని అభ్యర్ధనలు పెడుతుండంతో కిషోర్ ట్విట్టర్ లో వైరల్ గా మారారు. అయితే దీనిపై అతనికి సంబంధించిన వారు ఇంత వరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఎలాంటి వివరణ కానీ, ప్రకటన కానీ చేయకపోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.