ఒకరు ఉత్తరాదికి చెందిన హీరోయిన్. కానీ దక్షిణాదిలో అదృష్టాన్ని పరీక్షించుకుని ఫేమస్ అయింది. అటుపై మళ్లీ తిరిగి హిందీ పరిశ్రమకి వెళ్లింది. అక్కడ ఓ వెలుగు వెలిగింది. ఇటీవలే ఆ భామ బిగ్గెస్ట్ స్టార్ సరసన నటించి మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ఇదే వరుసలో మరో హీరోయిన్ సౌత్‌లో అగ్రస్థానంలో నిలిచి ఇప్పుడు హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరి హీరోయిన్లకి బాలీవుడ్‌లో బిగ్ షాక్ తగిలింది. అవకాశాలు తగ్గడంతో ఇద్దరి మధ్య కుమ్ములాట మొదలైందని సమాచారం. కాలక్రమేణా ఈ వార్ మరింత ముదురుతోందని సమాచారం. అవకాశాల పరంగా పోటీ పడుతోన్న ఈ భామలిద్దరు వ్యక్తిగత విషయాల్లోనూ పోటీకి దిగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇద్దరు తమ వ్యక్తిగత సిబ్బంది వారి ఖర్చులు సైతం నిర్మాతల నుండి ముక్కు పిండి మరీ వసూల్ చేస్తున్నారుట. చాలకపోతే అదనంగా డిమాండ్ కి సైతం దిగిపోతున్నారుట. ఇది వారి భారీ రెమ్యునరేషన్‌కు అదనంగా జరుగుతోన్న చర్య కావడంతో సదరు నిర్మాతలు సీరియస్ అవుతున్నారుట. అయితే ఈ సీరియస్ నెస్ కేవలం సౌత్ వరకే పరిమితమని తెలుస్తోంది.
ఈ డిమాండ్లను సౌత్ నిర్మాతలు పాటించడం తప్ప హిందీ నిర్మాతలు పూర్తిగా తిరస్కరించినట్లు సమాచారం. ప్రొడక్షన్ హౌస్‌లు హీరోయిన్లను తమ రెమ్యునరేషన్‌లో ఈ అదనపు ఖర్చులను తగ్గించుకోవాలని లేదా వారే సొంతంగా చెల్లించమని కరాఖండీగా చెప్పేస్తున్నారుట. ఈ విషయాలు ముందుగానే అగ్రిమెంట్ లో పొందు పరచడంతో హీరోయిన్లు ఇద్దరు కక్కలేని మింగలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.
దీంతో భామా మణులిద్దరు బాలీవుడ్ లో మౌనం దాల్చడం తప్ప చేసేదేమి లేదని తెలుస్తోంది. మరి సౌత్ నిర్మాతలు కూడా హిందీ నిర్మాతల తరహాలో ఇద్దరిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారా? సినిమా మార్కెట్ కోసం మౌనంగా ఉంటారా? అన్నది చూడాలి.
ఇటీవల వివిధ నిర్మాణ సంస్థల నుండి హీరోయిన్లు - వారి సిబ్బందిపై చాలా ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. కోవిడ్ మహమ్మారి తర్వాత సినిమా వ్యాపారం బాగా దెబ్బతింది. ఇప్పుడిప్పు కుదురుకుంటుంది. దీంతో హీరోలు - హీరోయిన్లు ఇద్దరూ నిర్మాతలకు అనుకూలంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని సంకేతాలు అందుతున్నాయి.