న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా జెర్సి రిలీజ్ కు ముస్తాబవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయినట్టే. భీమిలి కబడ్డీ జట్టు తర్వాత నాని చేస్తున్న ఫుల్ లెన్త్ స్పోర్ట్స్ డ్రామా ఇది. కాకపోతే అప్పుడు జస్ట్ హీరోలా ఉన్న నాని ఇప్పుడు స్టార్ గా మారిపోయాడు కాబట్టి దానికి తగ్గట్టే అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. కాకపోతే ఇందులో కథ ప్రకారం హీరో పాత్రకు ట్రాజిక్ ఎండింగ్ ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రాసుకున్నాడని గతంలోనే టాక్ వచ్చింది. ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందనే అనుమానం టీమ్ లో లేకపోలేదు.
అందుకే సమస్య రాకుండా రెండు వెర్షన్ల క్లైమాక్స్ షూట్ చేశాడట గౌతమ్. నిర్మాతలకు అతి దగ్గర వాడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు పంపిణి హక్కులు కొన్న దిల్ రాజు కలిసి చూసి ఒకటి ఫైనల్ చేస్తారని వినికిడి. ఇలా చేయడంలో ఉద్దేశం చాలా స్పష్టం. ఒకవేళ ఒకే క్లైమాక్స్ తీసి తీరా అది నచ్చలేదు అనిపిస్తే మళ్ళి రీ షూట్ చేయడం చాలా వ్యయంతో కూడుకున్న వ్యవహారం. అందుకే నాని గౌతమ్ లు చాలా తెలివిగా ప్లాన్ చేసి ఇలా రెండు క్లైమాక్స్ లు సిద్ధం చేసి ఉంచుకున్నారు.
ఒకవేళ రెండోది బాగుందన్న అభిప్రాయం వ్యక్తమైతే పడిన కష్టం ఇట్టే మర్చిపోవచ్చు. ఇలాంటి సినిమాల ఫలితాలను శాశించేది క్లైమాక్స్ లే కాబట్టి ఈ విషయంలో టీమ్ తీసుకున్న చర్యకు సర్వత్రా ప్రశంశలు దక్కుతున్నాయి. శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్న జెర్సి వచ్చే నెల 5 న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోసారి అధికారికంగా ప్రకటిస్తే పూర్తి క్లారిటీ రావొచ్చు