ఖైదీ నెం 150 పైరేట్ ను అరెస్ట్ చేసేశారు

Update: 2017-01-14 05:19 GMT
మామూలుగా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. ఎవరు ఎన్ని విధాలుగా ఆపాలని చూసినా కూడా.. ఈ పైరేట్లను మాత్రం ఆపలేకపోతున్నారు. లీగల్ గా ఒక ప్రక్కన చర్యలు తీసుకుంటున్నా కూడా.. సింపుల్ గా ధియేటర్లలో హై ఎండ్ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి సినిమాలను రికార్డు చేసేస్తున్నారు. అదిగో ఖైదీ నెం 150కు సైతం ఆ బాధలు తప్పలేదు.

అసలే మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ళ తరువాత ఇస్తున్న దర్శనం కాబట్టి.. ధియేటర్లో టిక్కెట్లు దొరక్కపోతే ముందు టొరెంట్లో అయినా చూసేద్దాం అని కొందరు అనుకునే ఛాన్సుంది. అలాంటి వారిని క్యాష్‌ చేసుకోవాలని చూసిన ఒక పైరేట్.. గత సాయంత్రం నల్గొండ జిల్లా చిట్యాలలో పట్టుబడ్డాడు. గతంలో ధృవ సినిమాను పైరసీ చేసి టొరెంట్ సైట్లలో పెట్టేసిన ఇతడు.. ఇప్పుడు ఖైదీ నెం 150ను కూడా అపలోడ్ చేస్తున్న సమయంలో రెడ్‌ హ్యాండెడ్ గా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ యాంటి పైరసీ సెల్.. అండ్ నల్గొండ జిల్లా పోలీసులు కలసి సంయుక్తంగా దాడి చేసిన ఇతడిని అరెస్టు చేయడం జరిగింది.

ఒక పైరేట్ ను అరెస్టు చేసి లోపలేశారు కాబట్టి.. ఇప్పుడు ఇతర పైరేట్లు కూడా భయపడే ఛాన్సుంది అంటున్నారు పోలీసులు. కాకపోతే ఇలాంటి అరెస్టులు గతంలో కూడా జరిగినప్పటికీ.. ఎప్పటికప్పుడు పైరసీ బూతం తెలుగు సినిమా ఇండస్ర్టీని కమ్మేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News