భారీ చిత్రాల నిర్మాణం కోసం చేతులు కలిపిన SVC - AAA..!

Update: 2021-10-30 08:13 GMT
తెలుగు సినిమా ఖ్యాతి ఖండాలు దాటిన తరుణంలో ఫిల్మ్ మేకర్స్ అదే స్థాయిలో సినిమాలు తీయడానికి కృషి చేస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ తో పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో సినిమాలు రూపొందించడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ చేతులు కలుపుతున్నాయి. అయితే ఇప్పుడు రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి జతకడుతున్నాయి.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి భారీ సినిమాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఈరోజు అభిషేక్ గ్రూప్ ఛైర్మన్ తేజ్ నారాయణ్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ బిగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఏషియన్ సినిమాస్ గ్రూప్ చైర్మన్ నారాయణ్ దాస్ కె నారంగ్ మార్గదర్శకత్వంలో సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు - అభిషేక్ అగర్వాల్ కలిసి హైక్వాలిటీ చిత్రాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు.

కొన్నేళ్ళుగా బిజినెస్ రంగంలో ఉన్న ఆసియన్ మరియు అభిషేక్ ఆర్ట్స్ ఫ్యామిలీలు.. సినిమాల డిస్ట్రిబ్యూషన్ తో పాటుగా నిర్మాణంలో కూడా తమదైన ముద్ర వేశారు. ప్రస్తుతం రెండు నిర్మాణ సంస్థలు వేర్వేరుగా.. ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి వివిధ ప్రాజెక్ట్‌ లను రూపొందిస్తున్నాయి. అయితే ఇప్పుడు కంటెంట్ రిచ్ సినిమాలు మరియు భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ లను నిర్మించడానికి జాయింట్ ప్రొడక్షన్ కు శ్రీకారం చుట్టారు.

ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ఈ రెండు నిర్మాణ సంస్థలు కలసి వస్తున్నాయి. SVCLLP మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహకారంతో రూపొందించబోయే ఫస్ట్ వెంచర్ మరియు ఇతర సినిమాల గురించిన వివరాలు రాబోయే రోజుల్లో ప్రకటించబడతాయి.


Tags:    

Similar News