యూఎస్ బాక్సాఫీస్.. గెలిచేదెవరో..

Update: 2023-01-14 03:58 GMT
సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు ఫ్యాన్స్ పరంగా పూనకాలు తెప్పించే సినిమా అని చెప్పాలి. తమ హీరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్నారు. వీరసింహారెడ్డి కంటే వాల్తేర్ వీరయ్య సినిమాకి కాస్తా బెటర్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

అయితే ఈ రెండు సినిమాలు ప్యూర్ తెలుగు మాస్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించివే కావడంతో దానికి తగ్గట్లుగానే తెలుగు రాష్ట్రాలలో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తెలుగు సినిమాకి యూఎస్ బాక్సాఫీస్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. మెగాస్టార్, బాలయ్య లాంటి స్టార్ హీరోల చిత్రాలు కావడంతో యూఎస్ లో కూడా ఈ రెండు సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అందులో భాగంగానే అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే సినిమాకి డీసెంట్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలలో వీర సింహారెడ్డి డే1 కలెక్షన్స్ 7 కోట్లు రాబట్టింది. బాలకృష్ణ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని యూఎస్ బాక్సాఫీస్ లో సంపాదించిన సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. దీనికి కారణం అఖండ బ్లాక్ బస్టర్ తో వచ్చిన హైప్ అని చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవికి కూడా యూఎస్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే వీరసింహారెడ్డితో పోల్చుకుంటే తక్కువని చెప్పాలి.

ఈ మూవీ మొదటి రోజు 5.5 కోట్ల కలెక్షన్స్ ని యూఎస్ లో సాధించింది. అయితే తెలుగు మార్కెట్ లో సినిమాలకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కూడా యూఎస్ లో ఉన్న తెలుగు ఆడియన్స్ నుంచి ఎవరేజ్ టాక్ ని ఈ రెండు సినిమాలు సొంతం చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో లాంగ్ రన్ లో ఎన్నారై ఆడియన్స్ ని ఏ మేరకు ఈ రెండు సినిమాలు మెప్పిస్తాయి అనే దాని మీద ఆధారపడి వీటి లాంగ్ రన్ కలెక్షన్స్ ఉంటాయి. అయితే తాజాగా వారసుడు సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయిన నేపధ్యంలో ఆ మూవీ వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి కలెక్షన్స్ పై ఎంతో కొంత ప్రభావం చూపించే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వారుసుడు మూవీ తెరకెక్కిన నేపధ్యంలో ఎన్నారై ఆడియన్స్ ని ఆకట్టుకునే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News