లైఫ్ లో అన్నిటా ఆ ఇద్దరి మధ్యా పోటీనే. ప్రేమలో పోటీపడ్డారు. పెద్దల్ని ఒప్పించి పరిణయం ఆడుకున్నారు. ప్రస్తుతం పెళ్లయ్యాకా అదే పోటీ. కెరీర్ పరంగా పోటీపడుతున్నారు. ప్రొఫెషనల్ గా ఒకరినొకరు ఢీకొడుతున్నారు. యూత్ స్ఫూర్తివంతంగా తీసుకునే ఆదర్శజంటగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఎవరీ జోడీ? అంటే .. ఇంకెవరు అక్కినేని నాగచైతన్య - సమంత జోడీ గురించే ఇదంతా.
అభిమానుల్లో ప్రస్తుతం ఆ ఇద్దరి గురించే హాట్ టాపిక్. చైతూ నటించిన శైలజారెడ్డి అల్లుడు - సమంత నటించిన యుటర్న్ ఒకేరోజు పోటీపడుతూ రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చైతన్య 75 శాతం రికవరీ సాధిస్తే - సామ్ 50 శాతం రికవరీని నిర్మాతలకు అందించిందిట. చైతూ నటించిన శైలజారెడ్డి అల్లుడు తొలి వారం ముగిసేప్పటికి దాదాపు 17 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించిందని లెక్కలు చెబుతున్నారు.
మరోవైపు సామ్ `యుటర్న్` ఇప్పటికి సుమారు 5 కోట్ల షేర్ వసూలు చేసింది. తొలి వారం వసూళ్లు ఇవి. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 9.50 కోట్లకు అమ్మారు. అందులో సగం మాత్రమే వసూలైంది. అంటే మిగతా 5 కోట్లు రాబట్టాల్సి ఉందింకా. అయితే అంత పెద్ద మొత్తం రాబట్టాలంటే ఈ వారం అంతా హౌస్ ఫుల్స్ చేయాలి. ఇక చైతూ 25 శాతం రికవరీ సాధించాల్సి ఉంది. కానీ రెండో వారంలో సినిమా ఆడాలంటే అంత సులువేం కాదు. చూద్దాం.. ఈ వైఫ్ & హజ్బెండ్ గేమ్ ఎలా ముగుస్తుందో? రెండో వారంలోనూ ఆశించినట్టే ఆట సాగుతుందో లేదో?