ఇక పై హగ్స్, లిప్ లాక్ సీన్స్ రద్దు: సీఎం వెల్లడి

Update: 2020-06-01 16:30 GMT
దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల పైగా మూతపడి ఉన్నాయి సినీ ఇండస్ట్రీలు. ఎన్నో విడుదలకు సిద్దమైన సినిమాలు ఆగిపోయాయి. ఎన్నో సినిమాలు షూటింగ్ దశలో నిలిచిపోయి నష్టాల పాలయ్యాయి. అయితే గత కొన్ని రోజులుగా షూటింగ్ కి అనుమతి కావాలని సినీ ఇండస్ట్రీలు ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలలో సినిమా షూటింగ్ లకు అనుమతి లభించగా కొన్ని రాష్ట్రాలలో లభించలేదు. అయితే ఇప్పుడు సినీ కెమెరాలు షూటింగుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ సినిమాల చిత్రీకరణకు అనుమతినిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే.. సినిమాలు, సీరియల్స్‌, యాడ్‌ షూటింగ్స్‌కు అనుమతినిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది.

ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌ జరుపుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇక పై ముద్దు సీన్లు, హగ్‌ సీన్లు వంటివి లేకుండా చిత్రీకరణ జరపుకోవాలని సూచించింది. అలాగే షూటింగ్స్ జరుపుకోవాలంటే తమతమ జిల్లాలకు చెందిన కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని.. సినిమా సెట్లు.. ఎడిటింగ్ స్టూడియోల్లో ఎక్కువ మంది ఉండకుండా భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభించాలి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్స్ తేదీని ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. టాలీవుడ్‌లో సినిమా షూటింగ్ లకు అనుమతి లభించిన విషయం తెలిసిందే. అందుకు ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. దశలవారీగా షూటింగ్స్‌కు అనుమతినిస్తామని తెలిపింది. అంతేగాక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా సినిమా షూటింగ్స్‌కు అనుమతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News