స్వీటీ అనుష్కకు టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు బాహుబలి చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. హిందీ ప్రేక్షకులు కూడా ఈమె పాత సినిమాలను ఆన్ లైన్ లో వెదికి మరీ చూస్తున్నారట. సౌత్ మరియు నార్త్ లో మంచి క్రేజ్ ఉన్న అనుష్క చేస్తున్న సినిమాలు ప్రస్తుతం ఒకే ఒక్కటి. బాహుబలి వంటి చిత్రం తర్వాత వరుసగా చిత్రాలు చేయాల్సిన అనుష్క బరువు పెరిగిన కారణంగా సినిమాలు తగ్గించింది. భాగమతి చిత్రం తర్వాత మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా నిశబ్దం.
త్వరలో నిశబ్దం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చిన ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ చూసి స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోయేలా ఉందని టాక్ వినిపస్తుంది. ఈమద్య కాలంలో స్టార్ హీరోల బర్త్ డేల సందర్బంగా కామన్ డీపీ అంటూ ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్నారు. స్టార్ హీరోలకు మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది. కాని రేపు బర్త్ డే జరుపుకోబోతున్న అనుష్కకు కూడా ఫ్యాన్స్ కామన్ డీపీ క్రియేట్ చేయడంతో పాటు హ్యాపీబర్త్ డే అనుష్క అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. రేపు ఆ హ్యాష్ ట్యాగ్ ను మరియు కామన్ డీపీని ట్రెండ్ చేసేందుకు ఫ్యాన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
సోషల్ మీడియాతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా చాలా అభిమానంను అనుష్కపై చూపుతున్నారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలను ఈమె చేస్తే ప్రేక్షకులు విరగబడి చూసేందుకు సిద్దంగా ఉన్నారు. లేడీ సూపర్ స్టార్ వంటి బిరుదు కూడా ఈమెకు దక్కే ఛాన్స్ ఉంది. వరుసగా సినిమాలు చేస్తే అనుష్క రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు అంటున్నారు. కాని అనుష్క మాత్రం తన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకోవడం లేదు. వరుసగా సినిమాలు చేయాలని భావించడం లేదు.
అనుష్క గ్యాప్ తీసుకుని ప్రస్తుతం చేస్తున్న నిశబ్దం చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యిందని అంటున్నారు. అయినా ఇప్పటి వరకు అనుష్క తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ రాలేదు. పలువురు దర్శకులు లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ లతో ఆమెతో చేసేందుకు సిద్దంగా ఉన్నారట. కాని అనుష్క నిశబ్దం విడుదలై ఫలితం వచ్చిన తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచించాలని భావిస్తుందట.
తమిళంలో స్టార్ హీరోయిన్ నయనతార వరుసగా సినిమాలు చేస్తూ ఒకేసారి రెండు మూడు సినిమాలకు సైన్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా దూసుకు పోతూ ఉంటే అనుష్క మాత్రం ఆచితూచి అడుగులు వేయడంపై ఆమె అభిమానులు స్వయంగా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. నిశబ్దం చిత్రం తర్వాత అయినా అనుష్క సినిమాల విషయంలో స్పీడ్ పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.