అమ్మ చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే. నాన్నకు చిన్నప్పటి నుంచి దూరంగానే ఉంటుంది. అలా అని అనాధ అని అనలేం. ఎందుకంటే ఆమె అందరికీ నచ్చే అందరి తలలో నాలుకలా మెదిలే అమ్మాయి. అందాల కథానాయిక. పైగా తెలుగమ్మాయి. ఇంతకీ ఎవరీ అమ్మాయి అంటే? ప‌్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అందరినీ ఓ ఆట ఆడుకుంటూ అల్లరి చిల్లరగా కనిపించిన తేజస్విని గురించే ఇదంతా. తేజస్విని తెరపై కనిపించే కోణం ఒకటి అయితే తెరవెనక కోణం ఇంకొకటి. చార్లీ చాప్లిన్ కి ఉన్నన్ని కష్టాలు తనకు కూడా ఉన్నాయి. ఆ మాటను తనే ఇదివరకూ చెప్పింది కూడా!
తేజస్విని తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తనకు నాన్న - అన్న ఉండేవారు. నాన్న తనని అల్లరి భరించలేక కొట్టేవాడు.. తిట్టేవాడు.అన్న సెల్ఫిష్ గా ఉండేవాడు. చెల్లిని పట్టించుకునేవాడు కాడు. బాల్యం ఎంతో కష్టంగా.. భారంగానే గడిచింది. తనకు 16 వయసు వచ్చేప్పటికి నాన్న అంటే ఇష్టం లేక తనకు తానుగానే సొంత కష్టంతోనే బతికేందుకు దూరంగా వెళ్లిపోయింది. అయితే అలా చేయడం తన తప్పేనని తేజస్వి రియలైజ్ అయ్యింది. ఎప్పటికైనా నాన్నను కలుసుకుంటానని అంది. ఇన్ని సంగతులు బుల్లితెరపై బిగ్ బాస్ షో వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు తెలుసు అని అనుకోలేం. బిగ్ బాస్ షో తొలి నుంచి చూసేవాళ్లకు ఆ విషాద గాధ తెలిసి ఉండొచ్చు. చూడని వాళ్లకోసమే ఇదంతా. తేజస్వినిని మరో చాప్లిన్ అన్న కోణంలోనూ చూడొచ్చు. తనలో ఎంతో విషాదాన్ని దాచుకుని - ఎదుటివారికి వినోదం పంచే చాప్లిన్ కథ కూడా కొందరికే తెలిసి ఉండొచ్చు. ఇకపోతే ప్రస్తుతం తేజస్విని ఎలిమినేషన్ గడపపై ఉంది. ఓ ఇద్దరిలోంచి ఒకరిని బిగ్ బాస్ బయటకు పంపించాలి. ఇవాళ ఇదేంటో తేలిపోనుంది. తేజస్విని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళుతుందా? వెళ్లదా? ఇప్పటికైతే సస్పెన్స్.