మేడం అంటే మెలికలు తిరిగిన ప్రభాస్..!

Update: 2022-12-30 06:19 GMT
అన్ స్టాపబుల్ షో లో ప్రభాస్ గెస్ట్ గా రావడం ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందించింది. మొత్తం ఎపిసోడ్ ఒక్కసారిగా కాకుండా ఈ ఎపిసోడ్ ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రభాస్ అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ ఒకటి గురువారం రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఈ షోలో బాలయ్య ప్రభాస్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. సరదా సంభాషణలతో ఎపిసోడ్ అంతా చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ తన పెళ్లి గురించి మాత్రం ముందు అడుగు వేయట్లేదు.  

ఈమధ్య ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రభాస్ కి లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ప్రభాస్ ని బాగానే ఆడుకున్నాడు బాలకృష్ణ. ఆ మేడం ఎవరు అంటూ చెప్పమని అడిగారు. ఫైనల్ గా ప్రభాస్ నోటి నుంచి కృతి సనన్ పేరు చెప్పించారు బాలకృష్ణ.

తనని ప్రభాస్ తో జత కడుతూ వచ్చిన వార్తలపై కృతి సనన్ స్పందించింది. ఆ విషయాన్నే ప్రభాస్ కూడా ఈ విషయంపై ఆమె ఆల్రెడీ ఏమి లేదని చెప్పిందని బాలయ్యతో అన్నాడు. నువ్వు నవ్వుతూ నో అంటున్నావ్.. ఆమె సీరియస్ గా నో అన్నది. కానీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అన్నట్టుగా బాలకృష్ణ కన్ క్లూజన్ కి వచ్చారు.

ఇక ఇదే విషయంపై చరణ్ కి ఫోన్ చేసి కూడా అడిగారు బాలయ్య. ప్రభాస్ చేసుకునే అమ్మాయి చౌదరి, రెడ్డి, సనన్, శెట్టి అంటూ చెప్పి చరణ్ ని కన్ ఫ్యూజ్ చేశారు. అయితే చరణ్ మాత్రం త్వరలో ప్రభాస్ ఓ గుడ్ న్యూస్ చెబుతాడని అన్నాడు.

దానితో నిజంగానే ప్రభాస్ ఏదో దాచేస్తున్నాడని బాలయ్య అనుకున్నారు. ఫోన్ లో చరణ్ మాట్లాడుతుంటే ప్రభాస్ కూడా ఒరేయ్ చరణ్ నువ్వు నా ఫ్రెండువా.. శత్రువువా.. ఏదన్నా ఉంటే చెప్పేయ్ కానీ ఇలా మధ్యలో ఆపకని సరదాగా అనేశాడు.  

నువ్విలా హింట్ ఇస్తే ఇండియా మొత్తం ఏదేదో రాసేస్తుందని అన్నాడు ప్రభాస్. మొత్తానికి తన మీద వస్తున్న రూమర్స్ మీద ప్రభాస్ సరదాగా స్పందించినా రెబల్ స్టార్ రెస్పాండ్ అయిన విధానం మాత్రం ఫ్యాన్స్ ని కూడా కన్ ఫ్యూజన్ లో నెట్టేస్తుంది. బాలకృష్ణ విత్ ప్రభాస్ ఎపిసోడ్ మొత్తం ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగింది. ఈ ఎపిసోడ్ పార్ట్ 2 కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. అందులో ప్రభాస్ ఫ్రెండ్ మరో హీరో గోపీచంద్ కూడా జాయిన్ అయ్యి ఇంటర్వ్యూని మరింత సరదాగా చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News