అన్ స్టాపబుల్.. పవన్ వచ్చేది అప్పుడే?

Update: 2022-10-17 08:38 GMT
నందమూరి బాలకృష్ణ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ కూడా చాలా గ్రాండ్ గా మొదలైంది. తన బావ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే అల్లుడు లోకేష్ తో బాలయ్య బాబు స్టార్ట్ చేసిన విధానం బాగానే వర్కౌట్ అయింది. మొదట పొలిటికల్ గా కొన్ని నెగటివ్ కామెంట్స్ వస్తాయి అని తెలిసినా కూడా ఈ తరహా ప్రయోగం చేసి మంచి క్రేజ్ అయితే అందుకున్నారు.

ఇక భవిష్యత్తులో రాబోయే గెస్ట్ లు ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. గతంలోనే మెగా హీరోలు కూడా ఈ టాక్ షోలోకి రాబోతున్నట్లుగా అనేక రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. ఇక రీసెంట్ గా బాలకృష్ణ షోలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మాట్లాడిన విధానాన్ని బట్టి పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు అందరూ ఊహించేసుకుంటున్నారు.

ఎందుకంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రతిసారి కూడా దర్శకుడు హీరో కాంబినేషన్ రిపీట్ చేస్తున్న బాలయ్య బాబు ఈసారి కూడా త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ ను షోలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడు అనే విషయంలో కూడా ప్రస్తుతం నిర్వాహకులు ఒక ఆలోచనలో ఉన్నారట.

గత ఏడాది సీజన్ మోహన్ బాబు ఫ్యామిలీతో మొదలుపెట్టి మహేష్ బాబుతో ఫినిషింగ్ టచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈసారి పవన్ కళ్యాణ్ తో ఆఖరి అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూట్ చేయాలని అనుకుంటున్నారు. మొదలు అలాగే ముగింపు అద్భుతంగా ఉండాలి అని నిర్మాత అల్లు అరవింద్ ఇదివరకే నిర్వాహకులకు ఒక క్లారిటీ ఇచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ తో అల్లు అరవింద్ ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. త్రివిక్రమ్ కూడా ఎప్పుడు పిలిచిన కూడా వచ్చేస్తాను అని అన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదు. అందుకే అన్ స్టాపబుల్ చివరి ఎపిసోడ్లో స్పెషల్ గా ఇన్వైట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News