చెర్రీని 'మిస్టర్ సి' అంటున్నదెవరో తెలుసా?

Update: 2016-05-18 17:09 GMT
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ని అభిమానులు ముద్దుగా చెర్రీ అని పిలుచుకుంటారు. ఇది ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు. మరి ఆయన భార్య ఉపాసన ఏమని పిలుస్తుంది? మామూలుగా అయితే ఇలాంటి వివరాలు బైటకు రావు. కానీ ఉపాసన స్వయంగా ఓ డిఫరెంట్ పిక్చర్ ని పోస్ట్ చేసి.. ఆ సీక్రెట్ విప్పేసింది.

ఉపాసన తన భర్తను ముద్దుగా 'మిస్టర్ సి' అని పిలుచుకుంటుందిట. అలాగే ఎప్పుడూ సీరియస్ గా కనిపించే రామ్ చరణ్.. భార్య దగ్గర మాత్రం అల్లరి పిల్లాడైపోతాడు. ఆ విషయం ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో చూస్తే అర్ధమైపోతుంది. పైగా.. ఆ పిక్చర్ గురించి మరిన్ని వివరాలు చెప్పింది చెర్రీ వైఫ్. 'ఇదిగో క్రేజీ ఫోటో. కెమేరాకు తిన్నగా పోజు కూడా ఇవ్వడం లేదు. మామూలుగా ఉండకుండా ఇదిగో ఇలా పోజ్ ఇచ్చాడు. ఇది మిస్టర్ సి లో ఉన్న మరో సైడ్.' అంటూ పోస్ట్ చేసింది ఉపాసన.

ఈ ఫోటోలో ఇద్దరి డ్రస్సులు సూపర్బ్ గా ఉన్నాయి కదూ. అది కూడా కావాలని ప్లాన్ చేసి డిజైన్ చేసింది కాదట. అనుకోకుండా అలా మ్యాచ్ అయిపోయాయని అంటోంది ఉపాసన. ఈ మధ్య తన భర్త రామ్ చరణ్ ప్రొఫెషన్ కి సంబంధించిన వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్న విషయం తెలుసు కదా.
Tags:    

Similar News