షాకింగ్: ఉపాస‌న ఎందుక‌లా ఎమోష‌న‌ల్ అయ్యారు?

Update: 2021-10-16 07:45 GMT
మెగా కోడ‌లు..రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసాన కొణిదెల సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. అభిమానుల‌కు సామాజిక కార్య‌క్రమాలపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం...చ‌ర‌ణ్ కి సంబంధించిన అప్ డేట్లు ఇవ్వ‌డం.. ఇలా సంద‌ర్భాన్ని బ‌ట్టి ఉపాస‌న సోష‌ల్ మీడియాల్లో అంద‌రికీ ట‌చ్ లో ఉన్నారు. ఇక పుట్టినిల్లు...మెట్టినిల్లు గురించి ఎంతో  బ్యాలెన్సింగ్ గా మాట్లాడుతారు. త‌మ కుటుంబ వ్య‌వ‌హారాల‌పై రేర్ గా మాత్ర‌మే స్పందిస్తుంటారు. అయితే తాజాగా ఉపాసాన ఓ ఎమోష‌న్ పోస్ట్ తో అంద‌రి హృద‌యాల్ని కరింగించేసారు. త‌న సోద‌రి అన్షుపాల పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా చెల్లెలికి విషెస్ తెలియ జేస్తూ కాస్త‌ మోష‌న‌ల్ అయ్యారు.

``నా బ‌లం ..నాకు నిజ‌మైన‌త ఆత్మ‌బంధువు. నువ్వు ఈ ఏడాది న‌న్ను వ‌దిలేసి చెన్నైకి శాశ్వ‌తంగా వెళ్లిపోయావ్. నిన్ను ఎంత‌గా మిస్ అవుతున్నానో చెప్ప‌లేను.. మాట‌ల్లో చెప్పేది కూడా కాదు. ఎంతో బాధ‌గా ఉంది. మ‌నం దెబ్బ‌లాడుకున్న ప్ర‌తీసారి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాం. ఆ కొట్లాట మ‌న బంధాన్ని మ‌రింత బ‌ల‌ప‌రిచింది. నిన్ను ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఐల‌వ్ యూ..`` అటూ ఉపాస‌న‌ ఓ పోస్టె పెట్టింది. ఇంత‌కీగా చెల్లి గురించి అక్క ఎందుకు అంతగా ఎమోన‌ల్ అయ్యారంటే?  ఆస‌క్తిక‌ర సంగ‌తే ఉంది. అన్షుపాల కు సెప్టెబ‌ర్ 12 ఆర్మాన్ ఇబ్ర‌హీంతో పెళ్లి జ‌రిగింది. అత్త‌వారిల్లు చెన్నై. కాబ‌ట్టి అన్షుపాల చెన్నైకి వెళ్ల‌క త‌ప్ప‌లేదు. పెళ్లైన  ద‌గ్గ‌ర నుంచి అక్క‌డే ఉంది. ఈ సంద‌ర్భంగా  నేడు అన్షుపాల పుట్టిన రోజు కావ‌డంతో ఇలా ఉపాస‌న చెల్లికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఉపాసాన‌-అన్షుపాల హైద‌రాబాద్ లో ఉన్నంత కాలం బ‌య‌ట ఎక్కువ‌గా క‌లిసి తిరిగేవారు. అక్కాచెల్లెళ్లు క‌న్నా మంచి స్నేహితులుగా మెలిగారు. ఈ నేప‌థ్యంలోనే చెల్లికి హైద‌రాబాద్ కుర్రాడినే ఇచ్చి పెళ్లి చేయాల‌ని ఉపాస‌న అనుకునేదిట‌. దీనిలో భాగంగా టాలీవుడ్ లో ఓ హ్యాండ్ స‌మ్ హీరో ఫ్యామిలీతో సంబంధం మాట్లాడిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఎంగేజ్ మెంట్ వ‌ర‌కూ వ్య‌వ‌హారం వ‌చ్చింద‌ని అప్ప‌ట్లో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. కానీ ఎందుక‌నో ఆప్లాన్ వ‌ర్కౌట్ కాలేదు. చివ‌రికి అన్షుపాల చెన్నై కుర్రాడాని పెళ్లాడి త‌మిళ‌నాడు వెళ్లిపోయింది.
Tags:    

Similar News