ఉపాస‌న నోట క‌ల్లోలం రేపే మాట‌.. ఒక‌టే ట్రోల్స్!

Update: 2022-03-08 02:30 GMT
మంత్రాలు వేరు.. సైన్స్ వేరు.. దైవ‌శ‌క్తులు దుష్ఠ‌శ‌క్తుల‌ను కొంద‌రు నమ్ముతారు.. కొంద‌రు న‌మ్మ‌రు. పురాణాల్ని కొంద‌రు న‌మ్ముతారు చాలా మంది న‌మ్మ‌రు. కానీ చివ‌రికి ఇవ‌న్నీ ఉన్నాయ‌ని రియ‌లైజ్ అయ్యేవారు లేక‌పోలేదు.  సైన్స్ ఎంత అభివృద్ధి  చెందినా ఈ సృష్టి ర‌హ‌స్యాన్ని ఎవ‌రూ క‌నిపెట్ట‌లేదు.

అయితే సైన్స్ ని న‌మ్మేవాళ్లు దేవుళ్ల‌ను పురాణాల‌ను న‌మ్మ‌కూడదా? ఈ కోణంలో ప్ర‌శ్నిస్తే.. స‌రైన ఆన్స‌ర్ ఇచ్చేవాళ్లు కూడా త‌క్కువే. ఒక్కొక్క‌రిని బ‌ట్టి ఆన్స‌ర్ లో యాంగిల్ మారిపోతుంటుంది. ఇదంతా ఎందుకు ? అంటే.. సైన్స్ ఆధారంగా వేల కోట్ల‌కు అధిప‌తి అయిన ఉపాస‌న నోట మంత్రం ప‌ఠించాల‌ని రావ‌డం ఇప్పుడు క‌ల్లోలం రేపుతోంది.  

రామ్ చరణ్ భార్య.. అపోలో లైఫ్ వైస్-ఛైర్ పర్సన్ ఉపాసన మానసిక ఆరోగ్యం శారీరక శ్రేయస్సు గురించి ఎప్పుడూ త‌న విజ్ఞానాన్ని పంచుతూనే ఉంటారు. ఇప్పుడు ఉపాసన ఔషధాల గురించి మాట్లాడే పాత వీడియో .. దానిని పురాణా లు.. ప్రాచీన సాహిత్యంతో లింకప్ చేస్తూ ఇంటర్నెట్ లో వైర‌ల్ అవుతోంది.  

ఈ వీడియోలో ఉపాసన మాట్లాడుతూ, ``మందులు తీసుకునే ముందు మీరు మహా మృత్యుంజయ మంత్రాన్ని రెండుసార్లు జపిస్తే అది మీకు బాగా పని చేస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. నేను దాని గురించి ఇటీవల చదివాను`` అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యకు మిశ్రమ ప్రతిస్పందన వ్య‌క్త‌మ‌వుతోంది. కొంతమంది ఉపాసన భారతదేశంలోని అత్యున్నతమైన హాస్పిటల్ చైన్ లలో (అపోలో) ఎగ్జిక్యూటివ్ గా ఉండటం వల్ల మూఢనమ్మకాలను  న‌మ్మ‌లేని పద్ధతులను ప్రచారం చేయకూడదు. ఇలాంటి ప్రకటన చేసినందుకు ఆమె సిగ్గుపడాలని వ్యాఖ్యానిస్తున్నారు.  

మరికొందరు ఉపాసన కేవలం ఒక వ్యాధిగ్ర‌స్తుడు త్వ‌ర‌గా కోలుకునేందుకు కీలకమైన సానుకూలత స్వీయ విశ్వాసం గురించి మాత్రమే చెబుతున్నారు. ఇలా చెప్ప‌డం త‌ప్పు కాదు. ఉపాసన ఉద్దేశ్యం మూఢనమ్మకాలను ప్రోత్సహించడం కాదు. దాని గురించి ఇప్పుడే చదివానని ఆమె స్పష్టంగా చెప్పింది. మందులు తీసుకునే ముందు మంత్రాన్ని పఠించమని ఆమె ఎవరినీ అడగలేదు.. అన్న వాద‌నా కొంద‌రు వినిపిస్తున్నారు.

అయినా సెలబ్రిటీల జీవితంలోని ప్రతి చిన్న కోణాన్ని పరిశీలించడం .. వారు చేసే ప్రతి చిన్న వ్యాఖ్యలపై పంచ్ లు వేయ‌డం స‌రికాదు. అభిప్రాయాల్ని పంచుకోనివ్వండి.. వాటిపై విశ్లేష‌ణ‌లు మాత్ర‌మే చేయండి. ఒక‌రిని వెంట‌నే కామెంట్ చేయాల్సిన అవ‌స‌రం ఏం ఉంది?
Tags:    

Similar News