వింట‌ర‌ట‌!... మెగా కోడ‌లు టిప్స్ విన్నారా?

Update: 2017-12-15 17:28 GMT
ఉపాస‌నా.. మెగా ఫ్యామిలీ కోడ‌లుగా - మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ తేజ్ స‌తీమ‌ణిగా మ‌నంద‌రికీ తెలిసిందే. ప్ర‌ముఖ వైద్యుడు డాక్ట‌ర్‌ ప్ర‌తాప్ సీ రెడ్డి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన ఉపాస‌న గురించి పెళ్లికి ముందు కూడా పెద్ద‌గా అవ‌స‌రం లేని వ్య‌క్తే. అయితే మెగా ఫ్యామిలీ కోడ‌లిగా మారిన త‌ర్వాత ఆమె మ‌రింత‌గా పాపుల‌ర్ అయ్యార‌నే చెప్పాలి. ఏదో పెళ్లి చేసుకుంది, హీరోగా జెట్ స్పీడులో ఉన్న భ‌ర్త గురించిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటుందిలే అనుకున్నారంతా. అయితే భ‌ర్త‌తో పాటుగా డాక్ట‌ర్ల ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన ఉపాస‌న‌... జ‌నం బాగోగులు గురించి కూడా బాగానే ఆలోచిస్తున్న‌ట్లుగానే ఉంది.

ఇప్ప‌టికే ప‌లు ర‌కాల డిషెస్ చేయ‌డంలో త‌న‌కున్న ప‌రిజ్ఞానాన్ని జ‌నానికి చెప్పిన ఉపాస‌న‌... తాజాగా పింక్స్‌విల్లా వేదిక‌గా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వీడియోను పోస్ట్ చేసింది. అప్పుడే శీతాకాలం ప్రారంభ‌మైపోయింది. క్ర‌మంగా చ‌లి కూడా పెరిగిపోతోంది. అంతేనా ఈ నెలాఖ‌రు నాటికి ఎముక‌లు కొరికే చ‌లిలో మ‌నం గ‌జ‌గ‌జ‌లాడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. మ‌రి ఈ త‌ర‌హా శీత‌ల వాతావ‌ర‌ణాన్ని త‌ట్టుకుని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?  బాడీని ఫిట్‌ గా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? అందుకు త‌గ్గ రెసీపీలు ఏమున్నాయ‌న్న విష‌యాల‌ను వివ‌రిస్తూ ఉపాస‌న విడుద‌ల చేసిన వీడియో ఇప్పుడు ప‌లువురు దృష్టిని ఆక‌ట్టుకుంటోంది.

చ‌లి వాతావ‌ర‌ణంలో మ‌న బాడీకి ర‌క్ష‌క క‌వ‌చంలా నిలిపే రెసిపీల‌ను వివ‌రించిన ఉపాస‌న‌... ఎలాంటి దుస్తులు ధ‌రించాలి? ఆ టిప్స్‌ను పాటించి తాను ఎలా ఫిట్‌గా ఉన్నాను? అనే విష‌యాల‌ను చాలా ఇంట‌రెస్టింగ్ వివ‌రించింది. ఉపాస‌న చెప్పిన వింట‌ర్ టిప్స్‌ను ఈ కింది వీడియోలో చూసి... మీరు కూడా వాటిని పాటించే దిశ‌గా అడుగులు వేయండి.

Full View
Tags:    

Similar News